ఆ హీరోయిన్ తో నాని ఇక ఎప్పటికీ సినిమాలు చెయ్యడా..! అంత పెద్ద గొడవ జరగడానికి కారణం?

టాలీవుడ్ లో న్యాచురల్ స్టార్ నాని( Nani ) కి యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎంత మంచి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ముఖ్యంగా ఆయనకీ నైజాం మరియు ఓవర్సీస్ వంటి ప్రాంతాలలో స్టార్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని వసూళ్లు వస్తుంటాయి.

 Nani Will Never Do Movies With That Heroine..! The Reason For Such A Big Fight-TeluguStop.com

రీసెంట్ గా విడుదలైన ‘దసరా‘ సినిమా అందుకు ఒక ఉదాహరణ.ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించి, సుమారుగా 60 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించి ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలలో ఒకటిగా నిల్చింది.

ఈ చిత్రం తర్వాత నాని అలాంటి భారీ సినిమాలనే తీస్తాడు అని ఆయన అభిమానులు అనుకున్నారు కానీ, ఆయన మాత్రం ఒక సాఫ్ట్ ఎమోషనల్ చిత్రం తో ఈరోజు ‘హాయ్ నాన్న‘ అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు.ఈ సినిమా కి ప్రీమియర్ షోస్ నుండే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

Telugu Dasara, Keerthy Suresh, Mrunal Thakur, Nani, Tollywood-Movie

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా విడుదలకు ముందు నాని ఎంత డిఫరెంట్ స్టైల్ లో ప్రొమోషన్స్ చేసాడో మనమంతా చూసాము.ఈ ప్రొమోషన్స్ లో భాగంగా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ అడిగిన ఒక ప్రశ్న కి చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.మీది మరియు కీర్తి సురేష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలకు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, మళ్ళీ మీరిద్దరూ కలిసి ఎప్పుడు నటిస్తారు అని అడగగా, దానికి నాని సమాధానం చెప్తూ ‘ఆమె ఇప్పుడు చాలా బిజీ గా ఉంది.తాను ఎప్పుడు ఓకే చెప్తే అప్పుడు నటించడానికి నేను రెడీ.

కీర్తి డేట్స్ అందుబాటులో ఉండాలి’ అంటూ నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.సోషల్ మీడియా లో గత కొంతకాలం గా వీళ్లిద్దరి గురించి కొన్ని గాసిప్స్ వినిపించాయి.

Telugu Dasara, Keerthy Suresh, Mrunal Thakur, Nani, Tollywood-Movie

అదేమిటంటే దసరా సినిమా విడుదల తర్వాత నాని మరియు కీర్తి సురేష్( Keerthy Suresh) మధ్య చిన్న విబేధాలు ఏర్పడ్డాయని, అప్పటి నుండి వీళ్లిద్దరు మాట్లాడుకోవడం లేదని, ఇక భవిష్యత్తులో వీళ్లిద్దరు కలిసి సినిమాలు చేసే అవకాశం లేదని వార్తలు వినిపించాయి.నాని ఈ ఇంటర్వ్యూ లో ఇచ్చిన సమాధానం తో ఆ రూమర్స్ మొత్తానికి చెక్ పడినట్టు అయ్యింది.మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుందో అని ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube