టక్ జగదీష్ కోసం బిగ్‌బీని ఫాలో అవుతున్న నాని

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వి అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో మరోసారి తన మార్క్ సక్సెస్ అందుకోవడానికి రెడీ అవుతున్నాడు నాని.

అయితే ఈ సినిమాలో తొలిసారి విలన్ పాత్రలో నటిస్తున్న నాని, తన నెక్ట్స్ మూవీని కూడా రెడీ చేసే పనిలో పడ్డాడు.ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో తన నెక్ట్స్ సినిమాను ప్రారంభించాడు.

టక్ జగదీష్ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని చాలా అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది.కాగా ఈ సినిమాలో నాని ఫ్రెంచ్ కట్ గడ్డంతో మనకు కనిపిస్తాడట.

ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.నానితో పాటు ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతి బాబు కూడా నటిస్తాడని తెలుస్తోంది.

Advertisement

ఫ్రెంచ్ కట్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది బిగ్ బీ అమితాబ్ బచ్చన్.దీంతో ఇప్పుడు నాని బిగ్ బి బాటలో పయనిస్తున్నాడని పలువురు కామెంట్ చేస్తున్నారు.

మరి ఈ లుక్‌లో నాని ఎలా కనిపిస్తాడో చూడాలి అంటున్నారు ఫ్యాన్స్.

Advertisement

తాజా వార్తలు