నాని లైనప్ లోని మరో సెన్సేషనల్ డైరెక్టర్.. ఈ కాంబో వస్తే పక్కా హిట్టే!

న్యాచురల్ స్టార్ నాని( Natural star Nani ) తన కెరీర్ లో నటించిన దసరా( Dasara movie ) సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 30న పాన్ ఇండియా వ్యాప్తంగా ఐదు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.

100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

Nani To Collaborate With Drushyam Director Details, Drushyam, Nani30, Mrunal Tha

ఇక ఈ సినిమా అలా బ్లాక్ బస్టర్ అయ్యిందో లేదో వెంటనే మరో సినిమాలో జాయిన్ అయిపోయాడు.నాని కెరీర్ లోనే బెంచ్ మార్క్ సినిమా 30వ ప్రాజెక్ట్ కూడా షూట్ స్టార్ట్ అయ్యింది.ఈ సినిమాను కొత్త డైరెక్టర్ శౌర్యన్ తెరకెక్కిస్తుండగా మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) ఈ సినిమాలో నానికి జంటగా కనిపిస్తుంది.

ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ గోవా స్టార్ట్ చేసి అక్కడే షూటింగ్ జరుపు కుంటుంది.

Nani To Collaborate With Drushyam Director Details, Drushyam, Nani30, Mrunal Tha
Advertisement
Nani To Collaborate With Drushyam Director Details, Drushyam, Nani30, Mrunal Tha

నాని ఇప్పటి వరకు కనిపించని పూర్తి విభిన్నమైన పాత్రలో ఆయన నటించనున్నాడు.సెప్టెంబర్ నాటికల్లా సినిమా షూట్ ను పూర్తి చేయనుండగా ఈ ఏడాది డిసెంబర్ 21న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇక ఈ సినిమాను వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చెరుకూరి మోహన్ నిర్మిస్తుండగా.

హీషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నాడు.ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత నాని చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడొక వార్త వైరల్ అవుతుంది.

నాని నెక్స్ట్ లైనప్ లో ఆసక్తికర డైరెక్టర్ పేరు వినిపిస్తుంది.అది కూడా మలయాళ ప్రముఖ డైరెక్టర్ అని తెలుస్తుంది.

జీతూ జోసెఫ్( Jeetu Joseph ) అనే మలయాళ స్టార్ డైరెక్టర్ తో నాని నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి.ఈయన దృశ్యం సినిమాతో మలయాళంలో ఫేమస్ అయ్యాడు.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

మరి అలాంటి సెన్సేషనల్ డైరెక్టర్ తో నాని సినిమా ఉంటే అది పక్కా హిట్టే.చూడాలి ఈ కాంబో ఉంటుందో లేదో.

Advertisement

తాజా వార్తలు