న్యాచురల్ స్టార్ నాని( Nani ) నటించిన అంటే సుందరానికి( ante sundaraniki ) సినిమా వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో తెరకెక్కింది.లాస్ట్ ఇయర్ సౌత్ అన్ని భాషల్లో రిలీజైన ఈ సినిమా యావరేజ్ బొమ్మగా నిలిచింది.
అయితే ఈ సినిమా సూపర్ హిట్ అనేస్తున్నాడు నాని.అంటే సుందరానికి సినిమాతో నిర్మాతలకు మంచి లాభాలు వచ్చాయని.
ఈ సినిమా ఫెయిల్యూర్ అంటే తాను ఒప్పుకోనని అంటున్నాడు నాని.ఆ సినిమా సెపరేట్ జోనర్ లో వచ్చిందని సినిమా చూసిన చాలామంది తనకు పర్సనల్ గా చాలా అద్భుతంగా ఉందని అన్నారని.
రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా అదొక ప్రయోగమని అన్నారు నాని.

ప్రెజెంట్ సినిమాను ముందు సినిమాతో పోల్చడం అందరికి అలవాటే అలానే అంటే సుందరానికీ సినిమాను శ్యామ్ సింగ రాయ్ తో పోల్చి సినిమా ఫ్లాప్ అంటున్నారు కానీ ఆ సినిమా నిర్మాతలకు మంచి ప్రాఫిట్స్ తెచ్చిందని అన్నారు నాని.ఆ సినిమా ఓటీటీలో చూసి చాలా మంది సూపర్ అంటూ తనకు పర్సనల్ మెసేజ్ లు చేశారని అన్నారు.ఇదివరకు కూడా నాని నటించిన వి సినిమా ఫ్లాప్ అంటే ఒప్పుకోలేదు.
టక్ జగదీష్ కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కాగా అది హిట్ అనేశాడు నాని.







