న్యాచురల్ స్టార్ నాని( Nani ) హీరోగా చేస్తున్న హాయ్ నాన్న( Hi Nanna ) సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.శౌర్యువ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను వైరా క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు.
సినిమా ఎక్కువ శాతం గోవా పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది.సినిమాలో మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur ) నటించడం మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు.
అయితే ఈ సినిమాలో మృణాల్ తో పాటుగా మరో హీరోయిన్ శృతి హాసన్ కూడా నటిస్తుంది.సినిమాలో పెళ్లై ఒక పాప కూడా ఉన్న నానికి మృణాల్ దగ్గర అవుతుంది.
అయితే నాని పెళ్లి చేసుకునేది శృతి హాసన్ నే( Shruti Haasan ) అని తెలుస్తుంది.ఈ సినిమాకు హాయ్ నాన్న అనే టైటిల్ ఫిక్స్ చేశారు.ఈ సినిమాలో శృతి హాసన్ నటిస్తుందని తెలుస్తున్నా సినిమా ప్రచాత్ర చిత్రాల్లో ఎక్కడ ఆమెను రివీల్ చేయట్లేదు.అసలు చాలామందికి సినిమాలో శృతి హాసన్ నటిస్తుంది అన్న విషయం కూడా తెలియనివ్వట్లేదు.
శృతి హాసన్ నాని తొలిసారి కలిసి నటిస్తున్నారు.నాని దసరా హిట్ కాగా హాయ్ నాన్న తో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.