స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న నందితా శ్వేత.. ఎందుకో తెలుసా?

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ నందిత శ్వేతా( Nandita Swetha ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

హీరోయిన్గా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నందితా శ్వేత.

మొన్నటి వరకు టీవీ షోకి జడ్జిగా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే.ఈ షోతో ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది నందితా శ్వేత.

ఇది ఇలా ఉంటే తాజాగా నందితా శ్వేత ఒక స్టేజ్ పై మాట్లాడుతూ కన్నీరు పెట్టుకుంది.అసలేం జరిగింది? నందితా శ్వేత ఎందుకు ఎమోషనల్ అయింది అన్న వివరాల్లోకి వెళితే.అశ్విన్ బాబు, నందితా శ్వేత పోలీస్‌ పాత్రల్లో నటించిన రీసెంట్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ హిడింబ( Hidimba ).

అనిల్ క‌న్నెగంటి ఈ సినిమాను తెర‌కెక్కించారు.అమ్మాయిల సీరియ‌ల్ కిడ్నాప్‌ల‌కు సంబంధించిన కేసును ఛేదించే నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే.శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి హిట్ టాక్‌ ను అందుకుంది.

Advertisement

ఈ నేపథ్యంలోనే తాజాగా ఏర్పాటు చేసిన సక్సెస్‌ మీట్‌( Hidimba Success Meet ) నటి నందితా శ్వేత మాట్లాడుతూ స్టేజ్‌పై కన్నీరు పెట్టుకుంది.ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు ఇలాంటి సీరియస్‌ రోల్‌ నేను చేస్తానని అస్సలు అనుకోలేదు.

దర్శకుడు అనిల్ నాపై ఎంతో నమ్మకం ఉంచారు.అశ్విన్‌,అనిల్‌ వల్లే నేను ఈ పాత్రకు న్యాయం చేయగలిగాను.

వాళ్లు నన్ను ఎంతగానో సపోర్ట్‌ చేశారు.

ఎక్కడికిపోతావు చిన్నవాడా( Ekkadiki Pothavu Chinnavada) తర్వాత హిడింబ సినిమాతో నాకు మంచి పేరు వచ్చింది.సినిమాపై ప్రేక్షకులు చూపిస్తోన్న ఆదరణకు ధన్యవాదాలు.ఇక, చిత్ర బృందం నాకొక కుటుంబం.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?

టీమ్‌ అందరితో నాకు మంచి అనుబంధం ఉంది.మా నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ఈ చిత్రాన్ని సిద్ధం చేశారు.

Advertisement

ఈ సినిమా నాకు సెంటిమెంట్‌గా కనెక్ట్ అయ్యింది.ఎందుకంటే, ఈ సినిమా షూట్‌లో ఉన్నప్పుడే మా నాన్న చనిపోయారు.

ఆయన ఆశీస్సుల వల్లే ఈ రోజు నాకు ఇంత మంచి పేరు వచ్చిందనుకుంటున్నా అంటూ ఎమోషనల్ అయింది నందితా శ్వేత.