బింబిసార 2 మూవీ డైరెక్టర్ ఎవరంటే..?

Nandamuri Kalyan Ram Bimbisara 2 Movie Director Details, Bimbisara, Nandamuri Kalyan Ram, Bimbisara 2 Movie Director, Bimbisara 2 Movie, Director Vasisth Malladi, Director Anil Paduri, Chiranjeevi,

నందమూరి కళ్యాణ్ రామ్( Nandamuri Kalyan Ram ) హీరోగా చాలా సంవత్సరాల తర్వాత హిట్ కొట్టిన మూవీ బింబిసార…( Bimbisara ) ఇంతకు ముందు ఈయన చేసిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి దాంతో గతేడాది వచ్చిన ‘బింబిసార’తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్.వశిష్ఠ్ దర్శకత్వంలో( Director Vashist ) ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించిన ఈ ఫాంటసీ ఫిల్మ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని ఘన విజయం సాధించింది.

 Nandamuri Kalyan Ram Bimbisara 2 Movie Director Details, Bimbisara, Nandamuri Ka-TeluguStop.com

అయితే ఈ సినిమా విడుదలకు ముందే, దీనికి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు.కానీ సినిమా విడుదలై పది నెలలవుతున్నా, ఇంతవరకు సీక్వెల్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు.

మధ్యలో ‘బింబిసార-2’( Bimbisara 2 ) నుంచి దర్శకుడు వశిష్ఠ్ తప్పుకున్నాడని వార్తలొచ్చాయి.ఒకానొక సమయంలో అసలు ఈ సీక్వెల్ ఉంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.

అయితే ఈ సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుందని, కానీ ప్రచారం జరిగినట్లుగానే దర్శకుడు మారనున్నాడని తెలుస్తోంది.

Telugu Bimbisara, Chiranjeevi, Anil Paduri, Vasisth Malladi, Nandamurikalyan-Mov

‘బింబిసార’ సక్సెస్ తో దర్శకుడు వశిష్ఠ్ కి పలు భారీ ఆఫర్లు వచ్చాయి.ప్రస్తుతం అతను మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే సన్నాహాల్లో ఉన్నాడు.వశిష్ఠ్ దర్శకత్వంలో చిరంజీవి సినిమా ఖరారైందని, త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని అంటున్నారు.

అందుకే వశిష్ఠ్ ‘బింబిసార-2’ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.అయితే ‘బింబిసార-2’కి కథ మాత్రం వశిష్ఠ్ నే అందించాడని, అంతేకాదు స్క్రిప్ట్ వర్క్ లోనూ తన వంతుగా సాయం చేయనున్నాడని వినికిడి.

ఈ వార్తల నేపథ్యంలో మరి ‘బింబిసార-2’కి దర్శకుడు ఎవరనే ఆసక్తి అందరిలో నెలకొంది.

Telugu Bimbisara, Chiranjeevi, Anil Paduri, Vasisth Malladi, Nandamurikalyan-Mov

‘బింబిసార’కి వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ గా వ్యవహరించిన అనిల్ పాడూరికి సీక్వెల్ దర్శకత్వ బాధ్యతలు అప్పగించాలని కళ్యాణ్ రామ్ నిర్ణయించాడట.అనిల్ దర్శకత్వంలో ఇప్పటికే ‘రొమాంటిక్’ అనే మూవీ రాగా, అది విజయం సాధించలేకపోయింది.అయినప్పటికీ అతని ప్రతిభని, వీఎఫ్ఎక్స్ పట్ల అతనికున్న పట్టుని చూసి బింబిసార-2 కి దర్శకుడిగా అనిల్ ని ఎంపిక చేసినట్లు సమాచారం.

ఇక ‘బింబిసార-2’ నిర్మాణంలో డిస్నీ కూడా భాగస్వామి కానుందని ఇన్ సైడ్ టాక్.ఈసారి భారీ బడ్జెట్ తో రూపొందించి, పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని అంటున్నారు.

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ అనే సినిమాలో నటిస్తున్నాడు.అది పూర్తయ్యాక బింబిసార-2′ పట్టాలెక్కే అవకాశముంది…

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube