'NBK108' కోసం మరోసారి ఆ టైటిల్ ను వైరల్ చేస్తున్న ఫ్యాన్స్!

నందమూరి బాలకృష్ణ ప్రెజెంట్ ఫుల్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్నాడు.

తన కెరీర్ లో ఎప్పుడు లేనంత జోష్ తో సినిమాలు ప్రకటిస్తూ వాటిని పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

అనుకున్న సమయానికి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు.గత పదేళ్లలో ఈయన ఎన్నో ప్లాప్ సినిమాలను ఎదుర్కున్నాడు.

అయితే ఆ ప్లాప్ సినిమాల నుండి అఖండ సినిమాతో బయట పడ్డాడు.అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలయ్య ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.

ఈ సినిమా తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో బాలయ్య సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు.

Advertisement

శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య తన 108వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నాడు.

వరుస హిట్స్ తో జోరు మీద ఉన్న అనిల్ ఈసారి బాలయ్యను సరికొత్తగా చూపించ డానికి రెడీ అవుతున్నాడు.ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసారు మేకర్స్.అయితే తాజాగా బాలయ్య ఫ్యాన్స్ ఈ సినిమా టైటిల్ విషయంలో సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.

అనిల్ రావిపూడి మాస్ కంటెంట్.బాలయ్య ఇమేజ్ కు తగినట్టు ఉండేలా బ్రో ఐడోంట్ కేర్ అనే టైటిల్ ను నెట్టింట వైరల్ చేసేసారు.ఈ టైటిల్ బాలయ్య ఇమేజ్ కు బాగా సూట్ అవుతుంది అని ఫ్యాన్స్ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరి ఈ సినిమాను అనిల్ తన మార్క్ హాస్యంతో పాటు యాక్షన్ కూడా జోడించి తెరకెక్కిస్తున్నట్టు ప్రచారం సాగుతుంది.చూడాలి ఈ సినిమాకు ఈ టైటిల్ ఫిక్స్ చేస్తారో లేదంటే వేరేది ఏమైనా పెడతారో.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20 శుక్రవారం, 2020
Advertisement

తాజా వార్తలు