నందమూరి నటసింహం బాలకృష్ణ ( Balakrishna ) కెరీర్ ఇప్పుడు దూసుకెళ్తుంది.ఒకప్పుడు వరుస ప్లాప్స్ ఎదుర్కొని కెరీర్ ఢీలా పడగా ఇప్పుడు బాలయ్య వరుస హిట్స్ తో కెరీర్ లో జెట్ స్పీడ్ తో దూసుకు పోతున్నాడు.
ఇటీవలే మరో సినిమాతో వచ్చి హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక ప్రజెంట్ బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబీ ( Director Bobby ) దర్శకత్వంలో ఒక సినిమాకు ( NBK109 ) కమిట్ అయ్యాడు.
ఈ సినిమాపై అప్పుడే అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి.ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవలే స్టార్ట్ అయ్యింది.
షూట్ స్టార్ట్ చేసినట్టు మేకర్స్ ఒక పవర్ ఫుల్ పోస్టర్ ద్వారా చెబుతూ ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పకనే చెప్పారు.
ఇక ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఏదొక న్యూస్ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి.మరి తాజాగా హీరోయిన్స్ గురించిన వార్త వైరల్ అవుతుండగా ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ ఇద్దరు అని టాక్.ఇప్పటికే బాలయ్య సరసన త్రిష కృష్ణన్ ( Trisha Krishnan )ను ఫైనల్ చేసినట్టు టాక్.
ఇక ఇప్పుడు మరో హీరోయిన్ ను కూడా ఫిక్స్ చేసారని తెలుస్తుంది.
ఈ సినిమాలో మరో హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని ( Meenakshii Chaudhary ) తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.ఏది ఏమైనా బాలయ్య, త్రిష, మీనాక్షి కాంబో అదిరిపోనుంది అనే చెప్పాలి.అధికారిక ప్రకటన వస్తే కానీ అసలు విషయం తెలియదు.
ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఫార్చ్యూన్ 4 ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తుండగా నిర్మాతలుగా నాగ వంశీ( Nagavamshi ) త్రివిక్రమ్ భార్య సౌజన్య( Sowjanya ) వ్యవహరించ బోతున్నారు.థమన్ సంగీతం అందించబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.