Balakrishna Vishwak Sen Dhamki: సినిమా అంటే అతనికి ఫ్యాషన్.. యంగ్ హీరో పై ప్రశంసలు కురిపించిన బాలయ్య?

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గత కొద్ది రోజుల క్రితం వరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.

యాక్షన్ హీరో అర్జున్ సినిమా నుంచి తప్పుకోవడంతో పెద్ద ఎత్తున ఈ విషయం వివాదాలకు కారణమైంది.

అయితే ఈ వివాదం అనంతరం తాజాగా విశ్వక్ స్వీయ దర్శకత్వంలో నివేదా పేతురాజ్ తో కలిసి నటిస్తున్న చిత్రం దాస్ కా దమ్కీ ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది.శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.ఈ ట్రైలర్ కార్యక్రమాన్ని ఏ ఎం బి సినిమాస్ లో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి నందమూరి నటసింహం బాలకృష్ణ ముఖి అతిథిగా పాల్గొని ఆయన చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా నందమూరి నటసింహం బాలకృష్ణ మాట్లాడుతూ ట్రైలర్ ఎంతో అద్భుతంగా ఉందని ఈ సినిమా తప్పకుండా అందరిని ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Nandamuri Balakrishna About Vishwak Sen At Dhamki Movie Trailer Release Event De
Advertisement
Nandamuri Balakrishna About Vishwak Sen At Dhamki Movie Trailer Release Event De

ఈ కార్యక్రమంలో భాగంగా హీరో విశ్వక్ గురించి కూడా బాలయ్య పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు.ఈయనకు సినిమా అంటే ఎంతో ఫ్యాషన్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.ఇలాంటి సినిమాలు చేస్తే నన్ను నేను ఊహించుకుంటానని ఈయన తెలిపారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ ఆదిత్య 369 సినిమా సీక్వెల్ గురించి కూడా క్లారిటీ ఇచ్చారు.ఈ సినిమా వచ్చే ఏడాది షూటింగ్ పనులను ప్రారంభం చేసుకోనుంది.

ఈ సినిమా ఆదిత్య 999 టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ ఈయన క్లారిటీ ఇచ్చారు.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు