శరత్ కుమార్. తమిళ్ లో స్టార్ హీరో గా ఒక వెలుగు వెలిగిన హీరో.
తెలుగు తో పాటు సౌత్ ఇండియాలో అన్ని భాషల్లో అతడి సినిమాలు విడుదల అయ్యేవి.అయితే కెరీర్ హీరో గా డౌన్ అయ్యాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మారిపోయి ఏటా ఎన్ని సినిమాల్లో నటిస్తున్నాడు.
హీరో గా నటించడానికి ముందు ఒక బాడీ బిల్డర్ గా ఆ తర్వాత జర్నలిస్ట్ గా పని చేసాడు.ఇక మొదటి సినిమా సమాజంలో స్త్రీ కాగా ఇది తెలుగు సినిమా కావడం విశేషం.
ఆ తర్వాత మెల్లిగా క్యారెక్టర్స్ సంపాదిస్తూ, విలన్ గా ఎక్కువగా నటించాడు.మెల్లిగా తనలోని నటుడిని గుర్తించిన తమిళ సినిమా ఇండస్ట్రీ హీరోగా అవకాశాలు ఇచ్చింది.
ఆలా తమిళ్ తో పాటు, తెలుగు, మలయాళ, కన్నడ సినిమాల్లో బిజీ స్టార్ అయ్యాడు.
ఇక తమిళ్ లో రెండు నంది అవార్డ్స్ కూడా దక్కించుకున్న శరత్ కుమార్ సినిమాల్లో నటిస్తున్న క్రమం లో హీరోయిన్ నగ్మా తో ప్రేమలో పడ్డాడు.
కానీ అప్పటికే ఛాయా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న శరత్ కుమార్ ఇద్దరు కుమార్తెలకు కూడా జన్మ ఇచ్చాడు.కానీ నగ్మా తో కలిసి అనేక సినిమాల్లో నటిస్తూ ఆమెతో రహస్య బంధాన్ని ఏర్పరుచుకున్నారు.
వీరి జోడి గురించి అప్పట్లో మీడియా లో వార్తలు రావడం తో ఈ విషయ శరత్ కుమార్ భార్య కు తెలిసింది.ఇక వారి బంధం పై ఆమె చాల సీరియస్ గా తీసుకున్న ఛాయా ఏకంగా డైవర్స్ కి అప్లై చేసింది.
భార్యతో బంధాన్ని నిలుపుకోవడానికి శరత్ కుమార్ ఏ విధంగానూ ప్రయత్నించలేదు.ఆ సమయంలో రాజకీయాల్లో సైతం బిజీ గా ఉన్నాడు.
ఒక ఎంపీ హోదాలో ఉండి, హీరోగా సైతం కెరీర్ కొనసాగిస్తున్న శరత్ కుమార్, నగ్మా ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు.ఛాయా తో విడాకుల విషయం తెలియగానే నగ్మా ఎందుకో తెలియదు కానీ శరత్ కుమార్ విషయంలో వెనక్కి తగ్గింది.అప్పటికే సౌరవ్ గంగూలీ తో కూడా ఇలాంటి ఇబ్బంది రావడం తోనే ఆమె శరత్ కుమార్ కి దగ్గరయింది.మల్లి కూడా ఆమె వల్ల విడాకులు జరుగుతున్నాయనగానే భయపడిన నగ్మా శరత్ కుమార్ ని దూరం పెట్టింది.
కానీ నగ్మా ఎడబాటును శరత్ కుమార్ తట్టుకోలేకపోయాడు.తనకు బ్రేకప్ చెప్తే చంపేస్తా అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడట.
ఇక ఆ దెబ్బతో ఆమె సౌత్ నుంచి భోజపురి కు మకాం మార్చింది.