బిగ్ బాస్ 7 హోస్ట్ గా ఈసారి కూడా నాగార్జనే... అలా క్లారిటీ ఇచ్చేసిన హీరో?

బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా చేస్తున్నారు.

ప్రస్తుతం తెలుగులో ఏడవ సీజన్ ప్రారంభం కాబోతోంది ఈ కార్యక్రమం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

అయితే ఎలాంటి అప్డేట్ లేకుండా ఒకేసారి ఈ రియాలిటీ షో లోగో ప్రోమో విడుదల చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.ప్రస్తుతం ఈ ఏడవ సీజన్స్ లోగో ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

త్వరలోనే ఈ కార్యక్రమానికి సంబంధించి మరొక అప్డేట్ కూడా రాబోతుందని తెలుస్తుంది.ఇకపోతే ఈ కార్యక్రమానికి హోస్ట్ ( Host ) ఎవరు అన్న విషయం గురించి అందరిలోనూ పెద్ద ఎత్తున సందేహం ఏర్పడింది.

గత నాలుగు సీజన్ల నుంచి ఈ కార్యక్రమానికి నాగార్జున ( Nagarjuna ) హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.అయితే ఈయనని నాలుగు సీజన్ల నుంచి చూస్తూ అభిమానులు చాలా బోర్ ఫీల్ అవ్వడమే కాకుండా కంటెంట్ల వ్యవహార శైలి పట్ల నాగార్జున ఏమాత్రం సీరియస్ కావడం లేదని వారిని చూసి చూడనట్లు వదిలేస్తున్నారని అదేవిధంగా నాగార్జున హౌస్ లో కొందరికి సపోర్ట్ చేస్తున్నారు అంటూ ఈయన పట్ల ఎన్నో విమర్శలు వచ్చాయి.దీంతో ఈ సీజన్ కి మాత్రం నాగార్జునని కాకుండా మరొక హీరోని రంగంలోకి దింపబోతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి.

Advertisement

అయితే ఈ వార్తలలో ఏమాత్రం నిజం లేదని బిగ్ బాస్ సీజన్ సెవెన్ హోస్ట్ గా కూడా నాగార్జున వ్యవహరించబోతున్నారని తెలుస్తోంది.ఇప్పటికే నాగార్జునకు సంబంధించి ఫోటోషూట్ కూడా పూర్తి అయిందని త్వరలోనే మరొక ప్రోమో ద్వారా నాగార్జున హోస్ట్ అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది.ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇందులో నాగార్జున లుక్ అందరిని ఆకట్టుకుంటుంది.అదేవిధంగా నాగార్జున చేతితో సెవెన్ సింబల్ చూపించడంతో బిగ్ బాస్ కార్యక్రమానికి ఈసారి కూడా తానే హోస్ట్ అని చెప్పకనే చెప్పేశారు.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?
Advertisement

తాజా వార్తలు