నాగార్జున వైల్డ్ డాగ్ ఓటీటీ లో విడుదల కాబోతుందా..?!

ప్రస్తుతం అక్కినేని నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇటీవలే మనాలిలో పూర్తి చేసి ఆపై మిగిలిన సినిమాని హైదరాబాదులో చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం.

ఈ సినిమాలో కింగ్ నాగార్జున ఎన్ఐఏ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు.చాలా రోజుల తర్వాత మన్మధుడు-2 లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత కింగ్ నాగార్జున నటిస్తున్న ఈ చిత్రంపై అనేక అంచనాలు నెలకొన్నాయి.

ఇదివరకు ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అందరిలో ఆసక్తిని తలెత్తేలా చేస్తోంది.అక్కినేని నాగార్జున ఈ సినిమాలో డేర్ డెవిల్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా ఏసిపి విజయ్ పాత్రలో నటించారు.

ఈ సినిమాలో నాగార్జున సరసన హీరోయిన్ గా దియామీర్జా నటిస్తోంది.ఈ సినిమా సినీ ప్రేక్షకులకు ఓ అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం తెలుపుతోంది.

Advertisement

ఇకపోతే ఈ సినిమా గురించి తాజాగా ఓ వార్త హల్ చల్ చేస్తోంది.లాక్ డౌన్ కారణంగా సినిమా థియేటర్స్ ఓపెన్ కాకపోవడంతో ఈ సినిమా డైరెక్ట్ గా ఓటిటిలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

అక్కడక్కడ థియేటర్స్ ఓపెన్ చేసిన ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లి సినిమాలు చూసే పరిస్థితి లేకపోయింది.

ఈ విషయాన్ని గుర్తుంచుకొని చిత్రబృందం సినిమాని డైరెక్ట్ గా ఓటీటీ ఫ్లాట్ఫామ్ లో విడుదల చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇందులో భాగంగానే చిత్రబృందం జోరుగా ప్రయత్నాలు చేస్తోందని టాలీవుడ్ టాక్.ఈ సినిమాను ఓటీటీ ఫ్లాట్ఫామ్ లో ఒకటైన నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రానికి భారీ ఆఫర్ ఇచ్చిందని.

ఆ సంస్థతో ప్రస్తుతం చిత్ర బృందం చర్చలు జరుగుతున్నాయని కొన్ని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం తెలుస్తోంది.ఒకవేళ వీరిద్దరి మధ్య చర్చలు సఫలీకృతం అయితే నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా అతి త్వరలో విడుదల కాబోతోంది.

ఆక‌లిగా లేదని భోజ‌నం మానేస్తున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం..!
పర్వత సింహంతో పోరాడిన కుక్క.. వీడియో చూస్తే వణుకే..

ఒకవేళ అదే జరిగినట్లయితే తెలుగు స్టార్ హీరోల సినిమా ఓటిటి ఫ్లాట్ఫామ్ లో విడుదలైన మొదటి చిత్రంగా నిలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు