నాగార్జున బుద్ది అదే.. పెద్దోడివి కాబట్టి ఏం మాట్లాడలేకపోతున్నాను.. మాధవీలత కామెంట్స్ వైరల్!

బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం మరో 5 రోజుల్లో ముగియనుంది.

ఇలా ఈ కార్యక్రమం ప్రసారం అవుతున్నప్పటి నుంచి పూర్తి అయ్యే వరకు ఏదో ఒక వివాదం ద్వారా విమర్శలను ఎదుర్కొంటు ఉంటుంది.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ఈ సీజన్ విమర్శల పాలవడానికి గల కారణం కచ్చితంగా హోస్ట్ నాగార్జున అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆయన గత రెండు సీజన్ల మాదిరిగా కాకుండా ఈ సీజన్ ఎంతో పక్షపాతంగా వ్యవహరిస్తూ కేవలం కొందరికి మాత్రమే సపోర్ట్ చేస్తూ వారు ఎలాంటి తప్పులు చేస్తున్న ప్రశ్నించకుండా కేవలం ఏంట్రా ఇది అంటూ సరదాగా మాట్లాడటంతో ఈ కార్యక్రమంలో సిరి, షణ్ముఖ్ లు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని పెద్ద ఎత్తున నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇక 14వ వారం ముగిసే సరికి కూడా నాగార్జున షణ్ముఖ్ ని సమర్థిస్తూ స్వయంగా తానే హగ్ చేసుకోండి అంటూ చెప్పడం కొందరు నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు.ఈ క్రమంలోనే సినీ నటి మాధవీ లత మరోసారి ఈ కార్యక్రమంపై స్పందించారు.

ఈ సందర్భంగా మాధవీ లత మాట్లాడుతూ.నాగ్ మామ మీరు హోస్టా.

Advertisement
Nagarjuna Mind Is The Same I Can Not Say Anything Because He Is Elber Man Madhav

ఘోస్టా మీరు హోస్టింగ్ చేయకుండా ఎందుకింత అవమానకరంగా మాట్లాడుతున్నారు.మీకు మీరే కౌంటర్లు వేస్తున్నారు.

ఒకరు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన మీకు ఆ తప్పుల్ని సరిదిద్దడం చేతకాకపోతే కౌంటర్లు వేసే హక్కు కూడా లేదు అంటూ ఘాటుగా స్పందించారు.బిగ్ బాస్ హౌస్ లో ఆ బుద్ధి లేని వాడికి (షణ్ముఖ్) మద్దతు తెలిపినప్పుడే మీ బుద్ధి ఏంటో బయట పడింది.

Nagarjuna Mind Is The Same I Can Not Say Anything Because He Is Elber Man Madhav

మీరు కూడా వాడి మాదిరే అని అందరికీ తెలిసిపోయింది.ఇక ఇన్ని రోజులు మీలో మార్పు ఉంటుందని వెయిట్ చేశాను కానీ చివరి వారంలో కూడా మీ హోస్టింగ్ లో ఏ మాత్రం మార్పు లేకపోవడంతో నటి మాధవీ లత ఘాటుగా స్పందించారు.ఈ కార్యక్రమం చివరి వారంలో కూడా ఎంతో పక్షపాతం చూపిస్తూ హోస్టింగ్ చేస్తున్నారు మీ కన్నా చిన్నవాడైన ఎన్టీఆర్ మేలు అతనిని చూసి అయినా హోస్టింగ్ నేర్చుకో అని చెప్పాలని ఉన్నా మీ వయసుకి రెస్పెక్ట్ ఇచ్చి చెప్పలేక పోతున్నాను అంటూ అనాల్సిన మాటలు అన్నీ అని మాధవీ లత మరోసారి నాగార్జునను ఏకిపారేశారు.

Nagarjuna Mind Is The Same I Can Not Say Anything Because He Is Elber Man Madhav

ఇక రెండవ తరగతి పిల్లాడు కూడా ఫ్రెండ్స్ హగ్ చేసుకోవచ్చా? కిస్ పెట్టుకోవచ్చా? అని అడుగుతున్నారు.ఇలా అడిగితే మొహం ఎక్కడ పెట్టుకోవాలి.వారికి ఏ సమాధానం చెప్పాలి.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

ఈ విధంగా యవ్వనంలో ఉన్న ఒక అమ్మాయి అబ్బాయి ఓకే బెడ్ పై పడుకోవడం,ముద్దులు పెట్టుకోవడం ఏంటి? ఈ కార్యక్రమం ద్వారా సమాజానికి ఏమి తెలియజేయాలని అనుకుంటున్నారు.ఇలా బిగ్ బాస్ హౌస్ లో సిరి ,షణ్ముఖ్ హద్దులు మీరి ప్రవర్తించడంతో చాలా మంది కుటుంబంతో కలిసి ఈ కార్యక్రమాన్ని చూడలేకపోతున్నారు అంటూ మాధవీ లత మరోసారి హోస్ట్ నాగార్జున పై షాకింగ్ కామెంట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు