టమాటోతో ఫేషియ‌ల్‌.. ప‌ది రోజుల‌కొక‌సారి చేస్తే సూప‌ర్ బెనిఫిట్స్‌!

ముఖ చ‌ర్మం స‌హ‌జంగా అందంగా, కాంతి వంతంగా ఉంటే ఎంత చూడ‌ముచ్చ‌ట‌గా క‌నిపిస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.అందుకే చాలా మంది న్యాచుర‌ల్ గ్లో కోసం తెగ ప్ర‌య‌త్నిస్తుంటారు.

 How To Facial With Tomato? Facial With Tomato, Facial, Tomato, Latest News, Skin-TeluguStop.com

ఈ క్ర‌మంలోనే త‌ర‌చూ బ్యూటీ పార్ల‌ర్‌కి ర‌క‌ర‌కాల ఫేషియ‌ల్స్ చేయించుకుంటారు.కానీ, ఇంట్లోనే ట‌మాటోతో ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా ఫేషియ‌ల్ చేసుకుంటే సూప‌ర్ స్కిన్ కేర్ బెనిఫిట్స్‌ను పొందొచ్చు.

మ‌రి లేటెందుకు ట‌మాటోతో ఫేషియ‌ల్ ఎలా చేసుకోవాలి.? అస‌లు ఈ ఫేషియ‌ల్ వ‌ల్ల వ‌చ్చే బెనిఫిట్స్ ఏంటీ.? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా రెండు బాగా పండిన ట‌మాటోల‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డ‌గాలి.

ఆ త‌ర్వాత‌ గింజ‌లు తొల‌గించి ట‌మాటోల‌ను మెత్త‌గా పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి.ఇప్పుడు ఈ ట‌మాటో పేస్ట్‌తోనే ఫేషియ‌ల్ ఎలా చేసుకోవాలో చూసేయండి.

స్టెప్‌-1: ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ ట‌మాటో పేస్ట్‌, ఒక స్పూన్ పెరుగు వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ముఖానికి, మెడ‌కు ఈ మిశ్ర‌మాన్ని ప‌ట్టించి.

రెండు నుంచి మూడు నిమిషాల పాటు క్లిన్సింగ్ చేసుకోవాలి.ఆపై గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని, మెడ‌ను శుభ్ర‌ప‌రుచుకోవాలి.

స్టెప్‌-2:

ఒక బౌల్‌లో రెండు స్పూన్ల ట‌మాటో పేస్ట్‌, ఒక స్పూన్ ఓట్స్ పౌడ‌ర్ వేసుకుని క‌లుపుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని యూజ్ చేసి ముఖాన్ని, మెడ‌ను స్మూత్‌గా స్క్ర‌బ్ చేసుకోవాలి.

స్క్ర‌బ్బింగ్ పూర్తి అయినంత‌రం వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.

స్టెప్‌-3:

ఒక బౌల్‌లో ఒక స్పూన్ ట‌మాటో పేస్ట్‌, ఒక స్పూన్ అలోవెర జెల్ తీసుకుని మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి క‌నీసం ప‌దిహేను నిమిషాల పాటు మ‌సాజ్ చేసుకోవాలి.ఆపై ఫేస్ వాష్ చేసుకోవాలి.

స్టెప్‌-4:

ఒక బౌల్‌లో రెండు స్పూన్ల ట‌మాటో పేస్ట్‌, ఒక స్పూన్ ముల్తానీ మ‌ట్టీ, చిటికెడు క‌స్తూరి ప‌సుపు, అర స్పూన్ లెమ‌న్ జ్యూస్ వేసుకుని క‌లుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ప్యాక్‌లా వేసుకుని ఇర‌వై నిమిషాల త‌ర్వాత వాట‌ర్‌తో వాష్ చేసుకోవాలి.

ఇక ప‌ది రోజుల‌కు ఒకసారి ఇలా ట‌మాటోతో ఫేషియ‌ల్ చేసుకుంటే చ‌ర్మం న్యాచుర‌ల్‌గానే అందంగా, గ్లోగా మారుతుంది.ముఖంపై న‌ల్ల మ‌చ్చ‌లు ఉంటే పోతాయి.స్కిన్ టోన్ పెరుగుతుంది.మ‌రియు ముఖం తేమ‌గా, మృదువుగా మారుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube