వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాగ్‌.. ఏమైంది కింగ్‌?

టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జునకు కోపం వచ్చింది.ఆయన యాపిల్‌ సంస్థకు చెందిన సర్వీస్‌ పై తీవ్రమైన అసహనం వ్యక్తం చేశాడు.

ఆపిల్‌ ఇండియా సర్వీస్‌ గురించి ఆయన తన ఆగ్రహంను వ్యక్తం చేశాడు.ఇండియాలో యాపిల్‌ ఫోన్‌ లను కొనుగోలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అంటూ అందరికి సూచించాడు.

Nagarjuna Fire About Apple Supporting, Apple, Nagarjuna, Nagarjuna Fire On Appl

ఇండియాలోని యాపిల్‌ స్టోర్స్‌ లో యాపిల్‌ ఫోన్‌ లు కొనుగోలు చేసినట్లయితే ఏ మాత్రం సర్వీసింగ్‌ పాలసీలు సరిగా లేవు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.ప్రతి సారి కూడా వారు కస్టమర్లను ఇబ్బంది పెడుతున్నారు అంటూ యాపిల్‌ ను మరియు యాపిల్‌ సపోర్ట్‌ ను ట్యాగ్‌ చేసి మరీ ట్వీట్‌ చేశాడు.

నాగార్జునకు అంతగా యాపిల్‌ సంస్థ పెట్టిన ఇబ్బంది ఏమై ఉంటుందా అంటూ అంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.ఒక స్టార్‌ హీరో అయిన నాగార్జున సర్వీసింగ్‌ విషయంలో ఇలా ట్వీట్‌ చేయడం ఆశ్చర్యంగా ఉందంటూ మరి కొందరు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు.

Advertisement

యాపిల్‌ ఫోన్‌ సరిగా లేదు.వారి సర్వీస్‌ అస్సలు బాగాలేదు అంటూ ఆయన యాపిల్‌ ఫోన్‌ నుండి ట్వీట్‌ చేశాడు అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

మొత్తానికి యాపిల్‌ ఫోన్‌ కు సంబంధించిన నాగార్జున ట్వీట్‌ చర్చనీయాంశం అయ్యింది.త్వరలో నాగార్జున వైల్డ్‌ డాగ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఆ తర్వాత వెంటనే బంగార్రాజు సినిమాను మొదలు పెట్టబోతున్నాడు.మరో వైపు బాలీవుడ్‌ లో బ్రహ్మాస్త్ర సినిమాను కూడా ఈయన చేస్తున్నారు.

ఇక బిగ్‌ బాస్‌ ను మరో రెండు వారాల్లో నాగార్జున ముగించబోతున్న విషయం తెల్సిందే.నాగార్జున బిగ్‌ బాస్‌ తో మరింత పాపులారిటీ ని దక్కించుకున్నాడు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు