రాష్ట్రంలో వైసీపీ మొదటి ఓడిపోయే సీటు నగరి నే : పృథ్వీరాజ్

అమరావతి: ఈ ఎన్నికల్లో వైసీపీ ని మడతపెడతామనే మాటే అన్నివర్గాల నోటా వినిపిస్తోందని జనసేన నేత, సినీనటుడు పృథ్వీరాజ్ అన్నారు.

ఏ సర్వే చూసినా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధ్బుత విజయo ఖాయమని స్పష్టమవుతోందని చెప్పారు.

ఉండవల్లిలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ని పృథ్వీరాజ్ శుక్రవారం నాడు కలిశారు.తెలుగుదేశం- జనసేన - బీజేపీ ఉమ్మడిగా ఈ ఎన్నికల్లో రూపొందించాల్సిన ప్రచార కార్యక్రమాలపై చర్చించారు.

ఈ సందర్భంగా పృథ్విరాజ్ మాట్లాడుతూ.పులివెందుల రెడ్లే ఈసారి జగన్ గెలవడం కష్టమని చెబుతున్నారని అన్నారు.

వైసీపీ( YCP )లో ఉన్నప్పుడు తన చిప్ సరిగా పనిచేయక చంద్రబాబు లోకేష్‌లపై విమర్శలు చేశానని అందుకు క్షమాపణలు కూడా చెప్పానని అన్నారు.తనకు కోవిడ్ వచ్చినప్పుడు బెడ్ అవసరమైతే అధికారంలో ఉన్న వైసీపీ పట్టించుకోలేదని మండిపడ్డారు.

Advertisement

మెగా బ్రదర్స్ బెడ్ ఏర్పాటు చేయిస్తే బతికి బయటపడ్డానని చెప్పారు.తానో సినిమాలో డాన్స్ చేస్తే సంబరాల మంత్రి( అంబటి రాంబాబుని ఉద్దేశించి.

) తట్టుకోలేకపోయారని ఎద్దేవా చేశారు.సంజన, సుకన్య అంటూ పరితపించే ప్రజా ప్రతినిధులు వైసీపీలో ఉన్నారని సెటైర్లు వేశారు.

రాష్ట్రంలో వైసీపీ మొదటి ఓడిపోయే సీటు నగరేనని చెప్పారు.నోరుంది కదా అని ఎలా పడితే అలా వాడేస్తే.

ఫలితం ఎలా ఉండబోతోందో రోజా చూస్తుందన్నారు.జగన్ అన్న వదిలిన బాణం(వైఎస్ షర్మిలని ఉద్దేశించి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 29, శనివారం 2024
నయనతారతో ఆ సినిమా చేసి తప్పు చేశా.. ప్రముఖ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

) వైసీపీనే పొడుస్తోందని ఆ పోటు దెబ్బ 12శాతం ఓట్లపై ప్రభావం చూపుతుందన్నారు.ఈ ఎన్నికల్లో175కి 175 అని విర్రవీగే వైసీపీ టైమ్ ఇక అయిపోయిందని ఆక్షేపించారు.

Advertisement

ఉమ్మడి ప్రచార కార్యక్రమాలు కలసి కట్టుగా రూపొందిస్తున్నామని తెలిపారు.ఈ నెల 18 నుంచి ప్రచార కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు.2019లో తాడేపల్లి క్యాంపు ఆఫీస్ వద్ద వైసీపీ విజయానికి టపాసులు కాల్చిన తాను, ఈసారి ఆ పార్టీ ఓటమికి మళ్లీ అక్కడే టపాసులు కాల్చుతానని అన్నారు. 2024లో జగన్‌కి ప్రజలతో పాటు ప్రకృతి కూడా సమాధానం చెబుతుందన్నారు.

సినీ పరిశ్రమ సమస్యలపై సచివాలయానికి చిరంజీవి వస్తే జగన్ అవమానించి పంపారని ధ్వజమెత్తారు.చిరంజీవి పెద్దరికంగా ఆలోచిస్తారు కాబట్టి జగన్ చేసిన అవమానంపై స్పందించలేదని చెప్పారు.

వింత జీవుల్ని ఐటీ, ఇరిగేషన్, టూరిజం మంత్రులుగా చూడటం ఏపీ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమని పృథ్వీరాజ్ అన్నారు.

తాజా వార్తలు