టాలీవుడ్ హీరో మెగా ప్రిన్సెస్ వరుణ్ తేజ్( Varun Tej ) ప్రస్తుతం వరుసగా సినిమాలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
ఒక సినిమా ఇంకా విడుదల కాకముందే మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు వరుణ్ తేజ్.
అందులో భాగంగానే వరుణ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం ఆపరేషన్ వాలెంటైన్.( Operation Valentine ) ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన మానుషి చిల్లర్( Manushi Chillar ) హీరోయిన్గా నటించింది.
శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.ఇకపోతే ఈ మూవీ మార్చి 1న విడుదల కానుంది.
ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.వరుణ్ తండ్రి, నటుడు నాగబాబు( Nagababu ) అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.వరుణ్ ఎప్పుడూ కొత్తదనంతో నిండిన సినిమాలు చేయాలనుకుంటాడు.
రిస్క్ తీసుకుంటాడు.ఆ క్రమంలో చాలా సార్లు ఫెయిల్ అయ్యాడు.
కానీ, కథలు, పాత్రలు ఎంపిక చేసుకునే విధానం నాకు బాగా ఇష్టం.కొడుకు విజయం అందుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో పరాజయం పొందినప్పుడు అంతే బాధ ఉంటుంది.
నా బాధ తనకు, తన బాధ నాకు తెలుసు.తనకు మంచి పర్సనాలిటీ ఉంది.
కొన్ని క్యారెక్టర్ల విషయంలో ఇలాంటి కటౌట్ ఉన్నవారు పెద్దగా పెర్ఫామెన్స్ చేయకుండా నిల్చున్నా చూసేందుకు బాగుంటుంది.జయాపజయాలకు అతీతంగా తను ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను.ఒక్కోసారి మంచి ప్రయత్నాలు కూడా ఫెయిల్ అవుతాయి.
దిగులు పడొద్దు.ప్రయత్నాలు చేస్తూ వెళ్తుంటే జీవితంలో సక్సెస్ అవుతారు అని వరుణ్ తేజ్ గురించి పొగుడుతూనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నాగబాబు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy