అక్కినేని మూడోవ తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య( Akkineni Naga Chaitanya ) తనదైన రీతిలో వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన గౌరవాన్ని కూడా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక అందులో భాగంగానే ఆయన ప్రస్తుతం తండేల్ అనే సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు.అయితే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.
పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమాతో మొదటి సారి నాగచైతన్య పాన్ ఇండియా( Pan India )లోకి అడుగుపెట్టబోతున్నాడు.ఇక ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.అయితే ఆమె ఈ సినిమాకి చాలావరకు ప్లస్ అవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఇక ఇది ఇలా ఉంటే దర్శకుడు చండు మొండేటి ఈ సినిమా ఇంటర్వెల్ లో ఒక భారీ ట్విస్ట్ కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.
అది ఏంటి అంటే సాయి పల్లవి( Sai Pallavi ) క్యారెక్టర్ ఇంటర్వెల్ లో చనిపోతుందట.దాంతో సినిమా మరొక మూడ్ లోకి వెళ్ళబోతుందని తెలుస్తుంది.
మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలీదు కానీ ఈ సినిమా మధ్యలోనే సాయి పల్లవి చనిపోతుందనే వార్తలైతే వస్తున్నాయి.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో అటు దర్శకుడు చందు మొండేటి( Chandoo Mondeti ) గాని, నాగచైతన్య గాని ఒక భారీ సక్సెస్ కొట్టబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.మరి ఇలాంటి సందర్భంలో సాయి పల్లవి బతుకుతుందా లేదా చనిపోతుందా అనేది అఫీషియల్ గా తెలియదు గానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త మాత్రం చక్కర్లు కొడుతుందనే చెప్పాలి.ఇక ఇది ఇలా ఉంటే ఆ తర్వాత చందు మొండేటి మరొక పెద్ద ప్రాజెక్టును కూడా డీల్ చేయబోతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి…
.