నెల గ్యాప్‌లో రెండు అప్‌డేట్స్ ఇస్తానంటోన్న నాగ్ అశ్విన్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ గురించిన అప్‌డేట్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను ఎప్పుడు పట్టాలెక్కిస్తాడో అని వారు మరింత ఆసక్తిగా ఉన్న సంగతి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

 Nag Ashwin Hints On Prabhas Movie, Nag Ashwin, Prabhas, Salaar, Radhe Shyam, Dee-TeluguStop.com

కాగా ఈ సినిమా తరువాత ప్రభాస్ ఇప్పటికే మూడు సినిమాలను లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే.

అందులో మొదటిగా దర్శకుడు నాగ్ అశ్విన్‌తో ఓ సైన్స్ ఫిక్షన్ చేయబోతున్నట్లు ప్రకటించిన ప్రభాస్, ఆ తరువాత ఆదిపురుష్, సలార్ చిత్రాలను వరుసబెట్టి ఓకే చేస్తూ తన స్పీడును చూపిస్తున్నాడు.

ఇక ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్‌తో ప్రభాస్ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందో అనే సందేహం అందరిలో నెలకొంది.కాగా ఇప్పటికే ఆదిపురుష్, సలార్ చిత్రాలను పట్టాలెక్కించే యోచనలో ప్రభాస్ ఉన్నాడని, ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక గాని నాగ్ అశ్విన్‌తో సినిమా చేయడేమో అనే సందేహం వారిలో నెలకొంది.

అయితే ఈ విషయంపై దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా ఓ హింట్ ఇచ్చాడు.

ఓ అభిమాని ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా వచ్చే సంక్రాంతికి ప్రారంభం అవుతుందేమో అని సందేహం వ్యక్తం చేయడంతో, ఈ విషయంపై నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు.

జనవరి 29న ఒకటి, ఫిబ్రవరి 26న ఈ సినిమాకు సంబంధించి రెండు అప్‌డేట్లు ఉండబోతున్నట్లు నాగ్ అశ్విన్ తెలిపాడు.అయితే జనవరి 29న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభోత్సవం, ఫిబ్రవరి 26న ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్‌కు సంబంధించిన అప్‌డేట్ చిత్ర యూనిట్ తెలియజేస్తుందేమో అని చిత్ర వర్గాలు అంటున్నాయి.

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ ప్రొడ్యూస్ చేయనుంది.మరి ఈ సినిమా నుండి రాబోతున్న రెండు అప్‌డేట్లు ఏమిటో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube