Nadendla Manohar: వైసీపీ కుట్రలు చేస్తుందంటూ నాదెండ్ల మనోహర్ సీరియస్ వ్యాఖ్యలు..!!

జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం మంగళగిరిలో పీఏసి సమావేశంలో పీఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ వైసీపీ ప్రభుత్వంపై సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

రాష్ట్రంలో జనసేన పార్టీకి ఆదరణ పెరుగుతూ ఉండటంతో జనసైనికులను ఇబ్బందుల పాలు చేయటానికి వైసీపీ కుట్రలు పన్నుతున్నట్లు ఆరోపించారు.

విశాఖ ఘటన రాష్ట్ర మొత్తం చూడటం జరిగింది.కుట్రపూరితంగా వైసీపీ వ్యవహరించినట్లు స్పష్టంగా అర్థమైంది.

ఆ టైంలో ఐపిఎస్ అధికారి పవన్ కళ్యాణ్ పట్ల వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు.హోటల్ లో ప్రవేశించి మరి పార్టీ నాయకులను కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు.

ఘటనా స్థలంలో లేని వ్యక్తులపై హత్యాయత్నం కేసులకు పెట్టడం జరిగిందని నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలో న్యాయస్థానంపై నమ్మకంతో 9 మందికి బెయిల్ రావడం నిజంగా సంతోషించదగ్గ విషయం అని అన్నారు.

Advertisement

ఇదే సమయంలో జైలుకు వెళ్లిన నాయకులకు కార్యకర్తల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ధైర్యం చెప్పినట్లు పేర్కొన్నారు.భవిష్యత్తులో ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరం కలిసి పోరాడాలని వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీయాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.

ఉల్లి తొక్కలతో ఊడిపోయే జుట్టుకు ఎలా చెక్ పెట్టవచ్చో తెలుసా?
Advertisement

తాజా వార్తలు