కాయిన్స్( Coins ) ఎవరికి అక్కర్లేదు? ఒక కాయిన్ దొరికితేనే ఇక్కడ అదృష్టంగా భావిస్తారు.అలాంటిది ఎక్కడ పడితే అక్కడ గుట్టలు గుట్టలుగా కాయిన్స్ కనబడితే ఎలాగుంటుంది? పండగ చేసుకోవాలనిపిస్తుంది కదూ.అవును, అక్కడ అదే సంఘటన జరిగింది.వివరాల్లోకి వెళితే, ఇంగ్లండ్‌లోని( England ) ప్రధాన నగరాల్లో ఒకటైన మాంచెస్టర్‌లో ఇటీవల కొన్ని రోజులుగా నాణేల కలకలం జనాల్లో చర్చనీయాంశంగా మారింది.
దాంతో ఈ తంతు సోషల్ మీడియాకు కూడా ఎక్కింది.ఈ నగరంలోని ఎక్కడబడితే అక్కడ అంటే… వీథుల్లోను, బస్టాపులు, పార్కింగ్ టికెట్ మెషిన్లు, పార్కుల్లోని బెంచీల మీద, వెండింగ్ మెషిన్లు, ఫుడ్ కోర్టులు సహా జన సమూహాలు తిరిగే బహిరంగ ప్రదేశాల్లో మిలమిలలాడే సరికొత్త నాణేలు దొరుకుతున్నాయి.
అవును, అక్కడ కొన్ని చోట్ల కాయిన్స్ చెల్లా చెదురుగా పడి ఉంటున్నాయి.దాంతో జనాల్లో కొందరు వీటిని జేబులో వేసుకుని తీసుకుపోతుంటే, మరికొందరు మనకెందులే అన్నట్లుగా ఎక్కడివక్కడే వదిలేసి ముందుకు వెళ్లిపోతున్నారు.ఈ నాణేలు వీథుల్లో ఎక్కడపడితే అక్కడ ఎందుకు కనిపిస్తున్నాయో, వాటిని ఎవరు పడేశారో, దీని వెనుక గల ఉద్దేశమేమిటో జనాలకు కొద్దిరోజుల వరకు అర్ధం కాకపోవడం గమనార్హం.అయితే, దీనివెనుక గల అసలు కారణం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఆ విషయం తెలుసుకున్న మాంచెస్టర్ ప్రజలు( Manchester ) ఓహో వీటిని ఎవరు పోగొట్టుకోలేదన్నమాట… అందుకేనా ఈ నాణేల గొడవ అని క్లారిటీ తెచ్చుకున్నారట.
విషయం ఏమిటంటే, ప్రస్తుతం జరుగుతున్న మాంచెస్టర్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ కోసం చేపట్టిన ‘ది ఫైండ్’( The Find ) అనే ఆర్ట్ ప్రాజెక్టులో భాగంగా ‘మార్క్ గాండెర్’ అనే కళాకారుడు ఈ నాణేలను రూపొందించినట్టు తెలుస్తోంది.మాంచెస్టర్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ జూలై 16 నాటితో ముగియనుండగా ఫెస్టివల్ చివరి రోజు వరకు నగరంలోని వేర్వేరు చోట్ల ఇలా దాదాపు 2 లక్షల నాణేలను పడివేసినట్టు ఆర్ట్ ప్రాజెక్ట్ నిర్వాహకులు తెలిపారు.“అన్వేషణ ద్వారా జ్ఞానాన్ని కనుక్కోగలం” అన్న విషయాన్ని ఈ నాణేలు గుర్తు చేస్తాయని, ఇవి నగరవాసులకు, సందర్శకులకు జ్ఞాపికలుగా మిగిలిపోతాయని మార్క్ గాండెర్ ఈ సందర్భంగా వెల్లడించడం విశేషంగా చెప్పుకోవచ్చు.