గూగుల్ ఎర్త్‌లో ఏరియా 51 మిస్టరీ.. ట్రయాంగిల్ టవర్ గ్రహాంతరవాసుల అడ్డానా?

నెవాడాలోని టాప్ సీక్రెట్ అమెరికా మిలిటరీ బేస్ ఏరియా 51 లో( Area 51 ) గూగుల్ ఎర్త్( Google Earth ) యూజర్లకు ఓ మిస్టరీ స్ట్రక్చర్ కనిపించింది.దాంతో మళ్లీ మొదలయ్యాయి ఏలియన్స్,( Aliens ) సీక్రెట్ ప్రయోగాలు అంటూ ఆన్‌లైన్‌లో పిచ్చెక్కిపోయే కాన్స్పిరసీ థియరీలు.

ఏరియా 51 అంటే మాటలు కాదు, నెవాడా ఎడారిలో 2.3 మిలియన్ ఎకరాల్లో విస్తరించి ఉన్న భారీ అమెరికా ఎయిర్ ఫోర్స్ బేస్ అది.భారీగా సెక్యూరిటీ ఉంటుంది.ఎప్పుడూ సీక్రెట్ మిలిటరీ రీసెర్చ్, యూఎఫ్ఓల గురించే అక్కడ చర్చ.1947లో రోస్‌వెల్ ఘటన తర్వాత చాలామందికి ఈ బేస్ మీద క్యూరియాసిటీ పెరిగిపోయింది.అప్పటినుంచి ఏరియా 51 అంటేనే సీక్రెట్ గవర్నమెంట్, ఏలియన్స్ అంటూ ఒక సింబల్ అయిపోయింది.

Mysterious Triangular Tower At Area 51 Is Discovered On Google Maps Details, Are

రీసెంట్‌గా గూగుల్ ఎర్త్ యూజర్లు ఈ బేస్‌లో ఓ వింత ట్రయాంగిల్ షేప్ టవర్‌ను( Triangular Tower ) చూశారు.టవర్ నీడ కూడా చాలా పొడవుగా ఉంది.ఇంకా షాకింగ్ ఏంటంటే గూగుల్ ఎర్త్ వాళ్లు దాన్ని బ్లర్ చేయలేదు, రిమూవ్ చేయలేదు.

అందుకే అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఆ టవర్ కోఆర్డినేట్స్ ఇవే: 37°1446.5"N 115°4924.0"W.ఇక ఈ ఫోటో వైరల్ అయిందో లేదో సోషల్ మీడియాలో రియాక్షన్లు మామూలుగా లేవు.కొందరు ఇది ఏలియన్ టెక్నాలజీ అని జోకులు పేల్చారు.

ఒక యూజర్ అయితే "భూమి పని అయిపోయాక ఇది బయటకి వస్తుంది" అని కామెంట్ పెట్టాడు.ఇంకొకరేమో "ఏలియన్స్ వైట్ పౌడర్స్ టెస్ట్ చేసేది ఇక్కడే" అని సెటైర్ వేశాడు.

Mysterious Triangular Tower At Area 51 Is Discovered On Google Maps Details, Are
Advertisement
Mysterious Triangular Tower At Area 51 Is Discovered On Google Maps Details, Are

కొంతమంది దానికి "టోబ్లెరోన్ ట్రేడ్ సెంటర్", "జెంగా కొత్త వెర్షన్" లాంటి ఫన్నీ పేర్లు పెట్టారు.2001: ఎ స్పేస్ ఒడిస్సీ మూవీలో మోనోలిత్‌తో కూడా పోల్చారు కొందరు.అందరూ జోకులు వేయలేదులెండి.

ఇది ఏలియన్స్ దిగడానికి సిగ్నలో లేదా యూఎఫ్‌ఓ ఛార్జింగ్ స్టేషనో అని సీరియస్‌గా నమ్మినవాళ్లు కూడా ఉన్నారు.బ్రెజిలియన్ మిస్టిక్ అథోస్ సలోమే అనే "లివింగ్ నోస్ట్రాడమస్" ఒకసారి ఏమన్నాడంటే, ఏరియా 51లో ఒక టన్నెల్ ఉందంట.

అది డైరెక్ట్‌గా త్రీ-డైమెన్షనల్ పోర్టల్‌కి దారి తీస్తుందంట.ఆ పోర్టల్ ద్వారా స్పేస్, టైమ్ ట్రావెల్ కూడా చేయొచ్చని ఆయన చెప్పాడు.

ఏదేమైనా ఈ కొత్త టవర్ డిస్కవరీతో ఏరియా 51 మరింత మిస్టరీగా మారిపోయింది.ఆన్‌లైన్‌లో ఏలియన్ థియరీలు మళ్లీ రెచ్చిపోతున్నాయి.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు