హీరో అప్పు కోసం 700 కిలోమీటర్లు పాదయాత్ర..

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జీవించింది 46ఏళ్ళు మాత్రమే.అయితే ప్రజల గుండెల్లో ఆయన ఎప్పుడూ చిరంజీవి.

పునీత్ మరణించి దాదాపు నెల రోజులు అవుతున్నా.ఆయన లేరనే వార్తను ఇంకా ఎవరూ జీర్ణించు కోలేక పోతున్నారు.

పునీత్ మీద ఉన్న తమ అభిమానాన్ని వివిధ రూపాలుగా వ్యక్తం చేస్తూనే ఉన్నారు.తాజాగా మైసూరుకు చెందిన అభిమానులు దివంగత హీరో అప్పు పై ఉన్న అభిమానాన్ని తనదైన శైలిలో చూపించు కున్నాడు.

పునీత్‌ రాజ్‌కుమార్‌కు నివాళులర్పిస్తూ కర్ణాటక లోని మైసూర్ నుండి శ్రీశైలం మల్లన్న సన్నిధికి అప్పు ఫ్లెక్సీలతో డప్పులు కొట్టు కుంటూ సుమారు 700 కిలోమీటర్లు పాదయాత్ర ప్రారంభించాడు.తన అభిమాన హీరో పునీత్ కు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ శ్రీశైలానికి పాదయాత్ర చేపట్టామని అభిమానులు చెబుతున్నారు.

Advertisement
వింటర్ లో జుట్టు అధికంగా రాలిపోతుందా.. జామ ఆకులతో పరిష్కరించుకోండిలా!