టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఎస్ ఎస్ తమన్ ఒకరు.ఈయన మొదట్లో ఎన్ని విమర్శలు ఎదుర్కున్న దృడంగా నిలబడి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు.
ఈయన ప్రెసెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు.తమన్ చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్ని కూడా సూపర్ హిట్ అవడమే కాకుండా అభిమానుల గుండెల్లో నిలిచి పోతున్నాయి.
ఇప్పుడు ఏ స్టార్ హీరో సినిమా అయినా కూడా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే వినిపించే పేరు థమన్.తమన్ అంతలా అభిమానులకు దగ్గర అవుతున్నాడు.
ఈయన అల వైకుంఠపురములో సినిమా దగ్గర నుండి వరుస విజయాలు అందుకుంటూ తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంటున్నాడు.ఈయన సినిమాలకు ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆడియెన్స్ మదిని గెలుచుకుంటున్నారు.
థమన్ అందించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది.గత ఏడాది క్రాక్, అఖండ వంటి సినిమాల విజయాల్లో తనవంతు పాత్ర పోషించాడు థమన్.
ఈ ఏడాది భీమ్లా నాయక్, సర్కారు వారి పాట సినిమాలతో సాలిడ్ విజయాలు తన ఖాతాలో వేసుకున్నాడు థమన్.ఈయన అందించే సంగీతం సినిమాను హై లెవల్ లో ప్రెసెంట్ అయ్యేలా చేస్తుంది.
దీంతో సక్సెస్ లో ఈయన పాత్ర కీలకం అయ్యింది.ఇక సర్కారు తర్వాత మరిన్ని భారీ ప్రాజెక్ట్స్ కు థమన్ పని చేస్తున్నాడు.
వాటిలో బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీ, మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ, విజయ్ దళపతి - వంశీ పైడిపల్లి వారసుడు మూవీ, చిరంజీవి గాడ్ ఫాదర్, రామ్ చరణ్ - శంకర్ ఆర్సీ 15, నాగ చైతన్య - విక్రమ్ కే కుమార్ థాంక్యూ మూవీ మెయిన్ గా కనిపిస్తున్నాయి.ఇవి కాకుండానే ఇంకా యాడ్ అవుతూనే ఉన్నాయి.ఇలా థమన్ చేతినిండా భారీ సినిమాలతో దూసుకు పోతున్నాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy