రాజీనామా చేస్తున్నా .. క్షమించండి ! కేసీఆర్ కు కనువిప్పంటూ రాజగోపాల్ సంచలనం

కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తున్నట్లు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రకటించేశారు.

ఇప్పటివరకు ఈయన రాజీనామా విషయంలో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే.

రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడకుండా కాంగ్రెస్ అధిష్టానం జానారెడ్డిని,  కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని రంగంలోకి దించినా ఫలితం లేకుండా పోయింది.బిజెపిలో చేరాలని రాజగోపాల్ రెడ్డి డిసైడ్ అవడంతో ఈ మేరకు తాజాగా ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని బాధతో చెప్తున్నా.కాంగ్రెస్ గుర్తుపై గెలిచి ఎమ్మెల్యే పదవిని అంటిపెట్టుకుని ప్రజల్లో తిరగలేను.

నేడో రేపో రాజీనామా చేస్తా.నా పదవి త్యాగంతో అయిన ఈ ప్రభుత్వానికి,  సీఎం కేసీఆర్ కు  కనువిప్పు కలగాలి.

Advertisement
Munugodu Mla Komati Reddy Rajagopal Reddy Resigned To Congress Party To Join Bjp

ప్రజాస్వామ్యంలో అన్ని నియోజకవర్గాలను సమానంగా చూడాలనే నిర్ణయానికి రావాలి.మునుగోడు అభివృద్ధి కావాలనే లక్ష్యంతో రాజీనామా చేస్తున్నా అంటూ  రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.

తాను కొంత కాలం పాటు కాంగ్రెస్ లోనే ఉండి ఆ తరువాత నిర్ణయం తీసుకుందామని భావించానని,  కానీ కొంతమంది గిట్టని వ్యక్తులు సోషల్ మీడియాలో , టీవీ ఇంటర్వ్యూలలో తన గురించి తప్పుగా మాట్లాడుతుంటే ఆ దుష్ప్రచారాన్ని ఆపేందుకే ప్రకటన చేస్తున్నానని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.కేవలం ఒక్క కుటుంబం తెలంగాణను పాలిస్తూ ఉందని విమర్శించారు .తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని , మంత్రులు ఎమ్మెల్యేలకు గౌరవం లేదని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైందని భవిష్యత్తు లో శ్రీలంక మాదిరిగా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లినా ఆశ్చర్యం లేదు. 

Munugodu Mla Komati Reddy Rajagopal Reddy Resigned To Congress Party To Join Bjp

రాష్ట్రంలో సిరిసిల్ల , సిద్దిపేట , గజ్వేల్ కు తప్పితే ఏ నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదు.కెసిఆర్ ఫామ్ హౌస్ చుట్టూ అమెరికాలో ఉన్నట్లు రోడ్లు ఉన్నాయి.ఈరోజు వేలమంది తిరిగే చోటుప్పల్ నారాయణపురం రోడ్డు మాత్రం గుంతలమయం అయ్యింది.

ఏ అభివృద్ధి చేయలేదని,  ఈ ఎమ్మెల్యే పదవిని అంటిపెట్టుకొని ఉండడం దేనికని రాజీనామా చేస్తున్నా అంటూ రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు.అభివృద్ధి అవుతుందంటే పదవి త్యాగం చేస్తానని ఎప్పుడో చెప్పానని రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

హుజూరాబాద్ లో దళిత బంధు ఇచ్చినప్పుడే మునుగోడు దళితుల కోసం 2000 కోట్లు ఇస్తే పదవి త్యాగం చేసి టిఆర్ఎస్ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపిస్తానన్న విషయాన్ని ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు.ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం వల్లే మునుగోడులో అభివృద్ధి చేయలేకపోయానని రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

Advertisement

కాంగ్రెస్ అంటే తనకు విశ్వాసం ఉందని,  సోనియాగాంధీ అంటే గౌరవం ఉందని రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు.కానీ నాయకత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో పార్టీ బలహీనపడుతోందని,  పార్టీలో అంతర్గతంగా ఈ విషయం మాట్లాడినా లాభం లేదని రాజగోపాల్ రెడ్డి వాపోయారు. కాంగ్రెస్ , సోనియాగాంధీని తిట్టినవారిని తీసుకొచ్చి వాళ్ల కింద మమ్మల్ని పనిచేయాలంటున్నారు .మాకు ఆత్మగౌరవం లేదా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్ద పేట వేయడమే కాదు.వాళ్లే ప్రభుత్వం తీసుకొస్తారని మాట్లాడుతారా ? పదవులు ఇవ్వకపోయినా కనీసం చర్చించి నిర్ణయాలు తీసుకోరా? కాంగ్రెస్ మీ కంట్రోల్ లో ఉండాలా ఏం తప్పు చేశామని మాపై చర్యలు తీసుకుంటారు? తెలంగాణ ఇచ్చి కూడా తప్పులు చేసి మూర్ఖంగా పార్టీని నాశనం చేశారు.దీనివల్ల కాంగ్రెస్ కార్యకర్తలు నష్టపోయారు" అంటూ రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు.

తాజా వార్తలు