యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి గురువారం వింత అనుభవం ఎదురైంది.ఇటీవల ఉపఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా చౌటుప్పల్ పట్టణంలో నిర్మించే దోభి ఘాట్ శంఖుస్థాపన కోసం ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆహ్వానించారు.
కానీ, శిలాఫలకం వేయడం మరిచారు.తీరా ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళేసరికి అసలు శిలాఫలకమే లేకపోవడంతో స్థానిక ప్రజాపతినిధులు, అదికారులపై ఎమ్మెల్యే కూసుకుంట్ల అసహనం వ్యక్తం చేశారు.
శిలాఫలకం లేకుండా తనను ఎందుకు ఆహ్వానించారంటూ ఫైరయ్యారు.చివరికి చేసేదేమీ లేకా అక్కడి నుంచి వెనుదిరిగారు.