మల్బరీ పండ్ల వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?!

మల్బరీ పండ్లు గురించి మీరు వినే ఉంటారు.ఈ పండ్లు తినడానికి కాస్త పులుపు, తీపిగా ఎంతో రుచికరంగా ఉంటాయి.

ఎంతో రుచికరంగా ఉండే ఈ మల్బరి పండ్లలో అనేక పోషకాలతో పాటు ఎన్నో రకాల ఔషద గుణాలు కూడా నిండుగా ఉన్నాయి.మరి మల్బరీ పండ్లను తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా.

మల్బరీ కాయల్లో విటమిన్ C తో పాటుగా ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లెవనాయిడ్లు, ఆల్కలాయిడ్లు పుష్కలంగా ఉన్నాయి.అలాగే వాటితో పాటుగా కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్ కూడా ఉన్నాయి.

మరి ముఖ్యంగా ఈ మల్బరీ పండ్లు తినడం వలన రక్తపోటు అదుపులో ఉంటుంది.ఈ కాలంలో చాలా మంది ప్రజలు అధిక రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.

Advertisement

అలాంటి వారు మల్చరీ పండు తింటే బ్లడ్ ప్రెజర్ అదుపులో ఉంటుంది.ఈ పండులో రెస్వెరట్రాల్‌ అనే యాంటీయాక్సిడెంట్‌ అధికంగా ఉంటుంది.

ఈ యాంటీ యాక్సిడెంట్ వలనే రక్తపోటు అదుపులో ఉంటుంది.అలాగే మల్బరీలో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది.

ఇందులో ఉండే ఐరన్ ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని మరింత పెంచుతాయి.మల్బరీ పండు తింటే గుండెకు సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతాయి.

ఈ మల్బరీ పళ్లకు హైపోలిపిడెమిక్‌ ఎఫెక్ట్‌ ఉంటుంది.అవి గుండె యొక్క కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మరింతగా మెరుగుపరుస్తాయి.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
చిరంజీవి విలన్ గా బాలీవుడ్ నటుడు..  మేకర్స్ పోస్ట్ వైరల్!

అంతేకాకుండా ఈ మల్బరీ పండ్లు తింటే మధుమేహం కూడా అదుపులో ఉంటుంది.ఈ పండ్లు రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయిలను తగ్గించి షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుతాయి.ఈ పండులో ఉండే సూపర్‌ ఆక్సైడ్‌ డిస్మ్యుటెస్‌, కేటలెస్‌ వంటివి ప్రీ రాడికల్స్‌ ను న్యూట్రలైజ్‌ చేసి మధుమేహాన్ని తగ్గిస్తాయి.

Advertisement

మల్బరీ పళ్ళను ఆహారంలో భాగంగా చేసుకుంటే కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది.కంటి శుక్లాల వంటి సమస్యలను తగ్గిస్తుంది.మల్బరీ పళ్లు తింటే రోగనిరోధక శక్తి కూడ పెరుగుతుంది.

ఎందుకంటే మల్చరీ పండ్లలో విటమిన్‌ C అధికంగా ఉంటుంది.బరువు తగ్గాలని భావించేవారు మల్బరీ పండ్లు తింటే త్వరగా బరువు తాగుతారు.

మల్బరీ పళ్లలో ఉండే కాల్షియం, ఐరన్‌ ఎముక యొక్క కణజాలాన్ని బలంగా ఏర్పడడానికి సహాయపడతాయి.ఫలితంగా ఎముకలకు సంబందించిన ఆస్టియోపోరోసిస్‌, ఆర్థరైటిస్‌ వంటి సమస్యలు తగ్గుతాయి.అలాగే మల్చరీలో ఉండే అంతోసియానిన్లు వివిధ రకాల క్యాన్సర్లను నివారించడానికి సహాయం చేస్తాయి.

మల్బరీ పళ్ళు న్యూరోప్రొటెక్టీవ్‌ చర్యలను కలిగి ఉంటాయి ఫలితంగా మెదడు సంబంధిత వ్యాధులు తగ్గించడంలో సహాయపడతాయి.అలాగే మల్బరీ పండులో ఉండే విటమిన్‌ A, విటమిన్‌ E, ల్యూటిన్‌, బీటా-కెరోటిన్‌ వంటి కెరోటినాయిడ్‌లు మన చర్మం, జుట్టు యొక్క ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి.

తాజా వార్తలు