Mrunal Thakur : వారిద్దరే నాకు స్ఫూర్తి.. మృణాల్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

మరాఠీ ముద్దుగుమ్మగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో నటి మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur ) ఒకరు.ఇలా మరాఠీ సినిమాలతో పాటు హిందీ సినిమాలలో నటిస్తే ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తెలుగు ప్రేక్షకుల ముందుకు సీతారామం( Sitaramam ) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

 Mrunal Thakur Interesting Comments On Dulquer Salmaan And Rashmika-TeluguStop.com

ఈ సినిమాలో సీతామాలక్ష్మిగా ఎంతో మంచి నటనను కనబరిచినటువంటి ఈమెకు తెలుగులో విపరీతమైనటువంటి అభిమానులు పెరిగిపోయారు.ఈ క్రమంలోనే తనకు తెలుగులో కూడా వరుసగా అవకాశాలు వస్తున్నాయి.

Telugu Dulquer Salmaan, Mrunal Thakur, Sitaramam-Movie

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమె తదుపరి హాయ్ నాన్న సినిమా( Hi Nanna ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్టు తన ఖాతాలో వేసుకున్నారు.త్వరలోనే విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్నటువంటి ఫ్యామిలీ స్టార్ సినిమా( Family Star ) ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి మృణాల్ ఠాకూర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరీర్లో ఇద్దరు స్ఫూర్తిగా నిలిచారని వారిని స్ఫూర్తిగా తీసుకొని తాను ఇండస్ట్రీలో కొనసాగుతున్నానని తెలిపారు.

Telugu Dulquer Salmaan, Mrunal Thakur, Sitaramam-Movie

సీతారామం సినిమాలో దుల్కర్ సల్మాన్( Dulquer Salman ) , రష్మిక మందన్న(Rashmika Mandanna) కూడా నటించిన సంగతి తెలిసిందే.వీరిద్దరూ తన జీవితానికి స్ఫూర్తిగా నిలిచారు అంటూ ఈమె తెలియజేశారు.రష్మిక కథలు ఎంపిక విషయంలో చాలా విభిన్నంగా ఉంటారని ఈమె తెలియజేశారు.

సీతారామం సినిమాలో అఫ్రీన్ పాత్ర చేయాలి అంటే చాలా ధైర్యం కావాలి ఆ పాత్రకు రష్మిక తప్ప మరెవరు సెట్ కారని తెలిపారు.ఇక ఈమె గంటలు తరబడి పనిచేస్తున్న ఏమాత్రం అలసిపోరని తెలియజేశారు.

ఇక దుల్కర్ సల్మాన్ భాషతో సంబంధం లేకుండా పాత్ర నచ్చితే ఇతర భాష సినిమాలకు కూడా తాను కమిట్ అవుతారని ఇదే తనకు సినిమాల పట్ల ఉన్నటువంటి అంకిత భావాన్ని తెలియజేస్తుందని మృణాల్ ఠాకూర్ తెలిపారు అందుకే నా వృత్తిపరమైనటువంటి జీవితంలో వీరిద్దరి నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube