తమిళంలో క్రేజీ ఛాన్స్ కొట్టేసిన మృణాల్... ఆ స్టార్ డైరెక్షన్లో చాన్స్!

సీతారామం( Sitaramam ) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు నటి మృణాల్( Mrunal ).

మొదటి సినిమాతోనే దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె విపరీతమైన అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు.

ఇలా నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం సౌత్ సినిమాలతో ఎంతో బిజీగా మారిపోయారు.ప్రస్తుతం తెలుగులో ఈమె నానితో కలిసి హాయ్ నాన్న ( Hai Nanna ) అనే సినిమాలో నటిస్తున్నారు.

త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమాతో పాటు తెలుగులో రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి మరొక సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

Advertisement

ఇలా తెలుగులో వరుస అవకాశాలతో ఈమె ఎంతో బిజీగా ఉన్నారు.ఇకపోతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ramcharan ) , డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా రాబోతున్న విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమాలో మృణాల్ నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.అయితే ఇప్పటివరకు ఈ వార్తలు గురించి ఎలాంటి స్పష్టత తెలియలేదు.

ఇదిలా ఉండగా తాజాగా ఈమె కోలీవుడ్ అవకాశాలను కూడా అందుకుంటున్నారని తెలుస్తుంది.తెలుగులో మాత్రమే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈమె సినిమా అవకాశాలను అందుకొని అక్కడ కూడా బిజీ కాబోతున్నారు.

ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్గా ఎంతో పేరు సంపాదించుకున్నటువంటి మురగదాస్( Muragadas ) దర్శకత్వంలో ఈమె నటించే అవకాశాన్ని అందుకున్నట్టు సమాచారం.మురగదాస్ దర్శకత్వంలో హీరో శివ కార్తికేయన్ (Shiva Karthikeyan ) నటిస్తున్నటువంటి సినిమాలో మృణాల్ హీరోయిన్ గా ఎంపిక అయ్యారని పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి.ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ వారు భారీ బడ్జెట్ తో సినిమా నిర్మిస్తున్నారని సమాచారం.

Bet365 бонусная программа: разбор механик, ограничений и реальной ценности
అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?

ఇక ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించబోతున్నారు.ప్రస్తుతం శివ కార్తికేయన్ కమల్ హాసన్ దర్శకత్వంలో సాయి పల్లవితో కలిసి నటిస్తున్నారు.ఈ సినిమా పూర్తి అయిన తర్వాత మురుగదాస్ డైరెక్షన్లో సినిమా సెట్స్ పైకి రానుంది.

Advertisement

ఇక ఈ సినిమాలో హీరోయిన్ మృణాల్ అనే విషయం గురించి త్వరలోనే అధికారక ప్రకటన కూడా వెలబడునున్నట్లు సమాచారం.

తాజా వార్తలు