బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న మృణాల్ ఠాకూర్ ని టాలీవుడ్ లో ఎంట్రీ ఇప్పించాడు డైరెక్టర్ హను రాఘవపుడి.అతను తీసిన సీతారామం సినిమాలో సీతామహాలక్ష్మి అలియాస్ నూర్జహాన్ పాత్రలో మృణాల్ ఠాకూర్ తన మార్క్ నటనతో ఆడియన్స్ హృదయాలను దొచుకుంది.
అప్పటి నుంచి అమ్మడి క్రేజ్ డబుల్ అయ్యింది.సీతారామం తర్వాత నాని30వ సినిమాలో ఛాన్స్ అందుకున్న మృణాల్ మరోపక్క విజయ్ దేవరకొండ పరశురాం సినిమాలో కూడా నటిస్తుంది.
ఇక ఈ సినిమా తర్వాత మృణాల్ కి మరో సినిమా ఆఫర్ కూడా లైన్ లో ఉందని టాక్.
స్టార్ డైరెక్టర్, స్టార్ హీరో పాన్ ఇండియా రేంజ్ లో తీయబోయే సినిమాలో మృణాల్ ఠాకూర్ ని హీరోయిన్ గా తీసుకునే అవకాశాలు ఉన్నాయట.రీసెంట్ గా ఆ సినిమా అనౌన్స్ మెంట్ రాగా.సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లో సెట్స్ మీదకు వెళ్లబోతుంది.
అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని తెలుస్తుంది.అందులో ఒక హీరోయిన్ గా మృణాల్ పేరు గట్టిగా వినిపిస్తుంది.
నాని, విజయ్ దేవరకొండ సినిమాలతో పాటుగా స్టార్ హీరో పాన్ ఇండియా సినిమాలో కూడా మృణాల్ లక్కీ ఛాన్స్ అందుకుంది.చూస్తుంటే టాలీవుడ్ లో మృణాల్ ని ఇప్పుడప్పుడే ఆపడం కష్టం అనిపించేలా అమ్మడికి అవకాశాలు వస్తున్నాయి.