ఎమ్మార్వో రమణయ్య హత్య కేసును చేధించాం..: విశాఖ సీపీ

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మార్వో రమణయ్య( MRO Ramanaiah ) హత్య కేసును చేధించామని విశాఖ సీపీ రవిశంకర్ తెలిపారు.

ఘటన చోటు చేసుకున్న ఆరు గంటల్లోనే నిందితుడిని గుర్తించామని పేర్కొన్నారు.

ఈ క్రమంలో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు.

అలాగే నిందితుడు చాలా సార్లు ఎమ్మార్వో కార్యాలయానికి కూడా వెళ్లినట్లు గుర్తించామని సీపీ రవిశంకర్( CP Ravishankar ) వెల్లడించారు.రియల్ ఎస్టేట్, భూ వివాదాలే రమణయ్య హత్యకు కారణమని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.అయితే నిన్న రాత్రి చినగదిలి రూరల్ ఎమ్మార్వో( Chinagadili Rural MRO ) రమణయ్యపై చరణ్ క్యాస్టల్ అపార్ట్ మెంట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి రాడ్ తో దాడి చేయగా.

ఆయన చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే.

Advertisement
మన ఇంటి ఆనంది మనోళ్లకు పెద్దగా నచ్చలేదు.. జాంబిరెడ్డి హీరోయిన్ ఆనంది గురించి ఆసక్తికర విషయాలు