ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల నుంచి రూ.800కోట్లు మాయం

ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల జీపీఫ్ ఖాతాల నుంచి డబ్బులు డెబిట్ అయిపోయాయి.ఎవరు మా డబ్బులు తీసుకున్నారో తెలియడం లేదు.

గతంలోనూ ఇదే తరహాలో జరిగితే ఫిర్యాదు చేస్తే మళ్ళీ తిరిగి వేశారు.గత రాత్రి నుంచి మళ్లీ ఉద్యోగుల ఖాతాల నుంచి విత్ డ్రా చేసుకున్నట్టు మెసేజ్ లు వచ్చాయి.

నా వ్యక్తిగత ఖాతా నుంచి 83 వేల రూపాయలు నాకు తెలీకుండా విత్ డ్రా చేసేశారు.పీఆర్సీ డీ ఏ అరియర్స్ జీపిఎఫ్ ఖాతాలకు జమ చేస్తానన్నారు.

గడచిన 6 నెలలు గా ఇచ్చిన డి ఏ అరియర్స్ ను మళ్ళీ వెనక్కు తీసుకున్నారు.మొత్తం 90 వేల మంది ఉద్యోగుల కు చెందిన జీపి ఎఫ్ ఖాతాల నుంచి 800 కోట్ల వరకు వెనక్కు తీసుకున్నారు.

Advertisement

ఆర్థిక శాఖ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే అధికారులు అందుబాటులో లేరు.ఈ తరహా ప్రభుత్వానికి తెలిసే జరుగుతున్నాయా లేక ఉన్నతాధికారుల తప్పిదమా తెలియడం లేదు .ఉద్యోగుల సమ్మతి లేకుండా మా ఖాతాల నుంచి సొమ్ము ఎవరో విత్ ద్రా చేయడం నేరం.దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తాం.

మార్చి నెలలో జరిగిన లావాదేవీల ను అకౌంటెంట్ జనరల్ మాకు ఇప్పటి వరకు తెలియ జేయకోవడం కూడా తప్పిదమే.ఆర్థిక శాఖ లోని సీ ఎఫ్ ఎం ఎస్ లో ఉన్న సీపియూ యూనిట్ వద్ద మా వేతన ఖాతాల నుంచి విత్ డ్రా చేసే సాంకేతికత ఉంది .ఇది ఎంత వరకు చట్టబద్దం.దీనిపై లోతైన విచారణ జరగాలి.

Advertisement

తాజా వార్తలు