ఏజెంట్ కోసం మోహన్ లాల్ ని దించుతున్న సురేందర్ రెడ్డి

అక్కినేని నాగార్జున నట వారసుడు అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు.

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాస్ నిర్మించాడు.

పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఇక యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కించారు.

Mohanlal Play Interesting Role In Agent Movie, Akkineni Akhil, Tollywood, Surend

ఇక ఈ సినిమాని అఖిల్ చాలా గట్టి హోప్స్ పెట్టుకొని ఉన్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు జరగడంతో పాటు సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ ని కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.అనిల్ సుంకర, సురేందర్ రెడ్డి కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Advertisement

ఇదిలా ఉంటే ఇందులో డిఫరెంట్ స్టైల్ లో మాసివ్ లుక్ లో అఖిల్ కనిపిస్తున్నాడు.మాసిన గెడ్డంతో, సిగరెట్ తాగుతూ ఉన్న అతని ఫస్ట్ లుక్ బట్టి క్యారెక్టర్ ని సురేందర్ ఎలా డిజైన్ చేశాడో అర్ధమవుతుంది.

ఈ సినిమాలో అఖిల్ ఓ అండర్ కవర్ ఏజెంట్ గా కనిపించబోతున్నాడని అర్ధమవుతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ ని సురేందర్ రెడ్డి సంప్రదించినట్లు తెలుస్తుంది.

ఈ పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని టాక్ నడుస్తుంది.పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మోహన్ లాల్ సినిమాలో కనిపిస్తాడని బోగట్టా.

ఇక అతను కూడా సినిమాలో నటించడానికి ఒకే చెప్పాడని తెలుస్తుంది.త్వరలో ఈ విషయాన్ని అఫీషియల్ గా ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని టాక్.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు