మంచు ఫ్యామిలి( Manchu Family ) లో ఎప్పటి నుంచి ముసలం నడుస్తున్న సంగతి అందరికి తెలుసు.
మంచు మనోజ్( manchu manoj ) రెండో పెళ్లి దగ్గరి నుంచి వీరి మధ్య గొడవలు తార స్థాయిలో ముందుకు వెళ్తున్నాయి.
ఇక అసలు విషయం ఏమిటి అంటే మోహన్ బాబు కి మంచు విష్ణు పైన ఉన్న గురి చిన్న కొడుకు మంచు మనోజ్ పైన లేదు అంటూ ఉంటారు ఇండస్ట్రీ లో.మంచు మనోజ్ మొదటి నుంచి పెద్దగా ఏ వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకునే వాడు కాదు.అతడికి సినిమాలు, స్నేహితులు తప్ప మరొక ప్రపంచం లేదు.
కానీ మంచు విష్ణు( manchu vishnu ) ఆలా కాదు.తండ్రికి సపోర్ట్ చేస్తూ బిజినెస్ వ్యవహారాలు, తిరుపతి విద్య సంస్థలు అన్ని కూడా అతడే భుజాన మోసే వాడు.
ఇంట్లో ఏదైనా పని చెప్పాల్సి వచ్చిన కూడా మోహన్ బాబు పెద్ద కొడుకు పై ఎక్కువగా ఆధారపడటం అలవాటు అయిపొయింది.దానికి తోడు మనోజ్ ఎప్పుడు కూడా తండ్రి తో కంటే కూడా అక్క తో, తల్లి తో క్లోజ్ గా ఉండేవాడు.మోహన్ బాబు మనోజ్ ని ఏ రోజు సీరియస్ గా తీసుకోలేదు.
అందుకే ఆర్థిక లావాదేవీలు మొత్తం విష్ణు చూస్తూ ఉండటం వల్ల అన్నదమ్ముళ్లలో గొడవలు మొదలయ్యాయి.ఇది రాను రాను పెరుగుతూ వచ్చింది.మోహన్ బాబు ఎప్పుడు పెద్ద కొడుకు విష్ణు ని బాగా ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు.
ఆవేశ పరుడు అనే కారణం తో మనోజ్ ని కాస్త దూరం పెట్టారు.ఇప్పుడు వంద కోట్ల సినిమా తీస్తున్నాను అంటూ దేవుడి సన్నిధి లో చెప్పిన మోహన్ బాబు ఆ విషయాలు పూర్తిగా విష్ణు చూస్తున్నాడు అని చెప్తున్నాడు.
కాలేజీ లో సమస్య ఉన్న, సినిమా విషయాల్లో ఇబ్బందులు ఉన్న అన్ని కూడా విష్ణు బాగా హ్యాండిల్ చేయగలడు.మనోజ్ పెళ్ళికి కూడా చివరి నిముషం లో తూతూ మంత్రంగా వచ్చి వెళ్లి పోయారు విష్ణు మరియు మోహన్ బాబు.వీరిద్దరికి మనోజ్ చేసే ఏ పని నచ్చదు.
ఒక్క అవకాశం ఇచ్చి చూస్తే కదా అతడు ఎలా చేయగలడు అనేది తెలుస్తుంది.సినిమాలు అంటాడు, రాజకీయాలు అంటాడు, కోపం వస్తే ఏం చేస్తాడో తెలియదు, ఇంటి గుట్టు బయట పెట్టేస్తాడు అంటూ మనోజ్ పై చాల కంప్లైంట్స్ ఉన్న కూడా లక్ష్మి తమ్ముణ్ణి సెక్యూర్ చేస్తూ ఉంటుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy