ఆ రెండు పార్టీల అడ్రస్ గల్లంత చేస్తాం : మోదీ

తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి తెలంగాణ లో పర్యటించిన మోడీ తన విజయ సంకల్ప యాత్రలో తెలంగాణ ప్రజానీకాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు అధికార “బారాస” పార్టీ అవినీతి ఢిల్లీ వరకు వినిపిస్తుందని, ఎక్కడైనా అభివృద్ధి కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పొత్తు పెట్టుకోవడం చూస్తున్నామని కానీ అవినీతి చేసేందుకు ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని పార్టీలు పొత్తు పెట్టుకోవడం మొదటిసారి చూస్తున్నానని, తెలంగాణలో వేల మంది అమరవీరులు బలిదానం చేసేది ఇలాంటి అవినీతి చూడడానికా అంటూ ఆయన ప్రశ్నించారు .

జనసంఘ్ నుంచి భాజాపాకు వరంగల్ చేయూతనిస్తుందని అప్పుడు భాజపా గెలుచుకున్న రెండు ఎంపీ సీట్లలో ఒకటి హనుమకొండ అని అందుకు వరంగల్ ప్రజలకు కృతజ్ఞుణ్ణి అయ్యి ఉంటానని మోదీ చెప్పుకొచ్చారు.

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అవినీతిని దేశమంతా చూసిందని ఇప్పుడు భారతీయ రాష్ట్ర సమితి అవినీతిని తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం చూస్తుందని ఈ రెండు విశ్వాస ఘాతక పార్టీలని,ప్రజల ఆశలను ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేశాయని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

దేశం మొత్తం మీద బారాస అంత అవినీతి పార్టీ లేదని మోడీ దుయ్యబట్టారు .తెలంగాణలో పంచాయతీలు అభివృద్ధి కోసం 12 వేల కోట్లు కేంద్ర మంజూరు చేసిందని, ఆనిదులతోనే తెలంగాణ గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలంగాణ అభివృద్ధి కోసం దాదాపు 26 వేల కోట్ల రూపాయల ఖర్చు చేశామని మోడీ చెప్పుకొచ్చారు.తెలంగాణ అభివృద్ధిపై కట్టుబడి ఉన్నామని రైల్వేల బడ్జెట్ కూడా 17 రెట్లు పెరిగిందని మేకిన్ ఇండియాలో భాగంగా మనం అతి త్వరలోనే వెయ్యరైల్వే కోచ్ లు ఇంజన్ల తయారీ చేపట్టి పొరుగు దేశాలకు ఎగుమతి చేయబోతున్నామని అందులో భాగంగానే కాజీపేట ఫ్యాక్టరీ నిర్మాణం ఉందని దీని నిర్మాణం ద్వారా తెలంగాణలో వేలాది యువతకు ప్రత్యక్ష ఉపాధి అవకాశాలతో పాటు మరెన్నో వేలమంది కి పరోక్ష ఉపాధి కూడా దొరుకుతుందని ఆయన చెప్పుకొచ్చారు.

సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ ఆయన కార్యక్రమాన్ని ముగించారు.

Advertisement
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 1, శనివారం, 2021

తాజా వార్తలు