తెలంగాణ నుంచి మోదీపోటీ! కమలదళం నయా స్కెచ్?

దేశాన్ని ఇప్పటికే రెండుసార్లు పరిపాలించిన కమలనాధులు ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలగా ముందుకు వెళ్తున్నారు.

ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ పుంజకోకపోవడం ప్రతిపక్షాల పొత్తు ఇంకా బాలరిస్టాల దశను దాటకపోవడంతో మోడీకి గట్టి పోటీ ఇచ్చే నాయకుడు కూడా కనుచూపు మేరలో కనిపించడం లేదు.

ముఖ్యంగా మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏకపక్షంగా గెలుచుకోవడంతో భాజపాలం మరింత పెరిగినట్లుగా కనిపిస్తుంది .ఉత్తరాదిన ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పాగా వేసిన భాజాపాకు దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం అంత అనుకూలం గా పరిస్తితి లేదు.అయితే గడిచిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలతో పాటు దాదాపు 12 శాతం ఓటు బ్యాంకును పొందడం తో ఇప్పుడు తెలంగాణపై కేంద్ర భాజపా కొత్త ఆశలు పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది.

ముఖ్యంగా కర్ణాటక తర్వాత కంచుకోటగా మారే అవకాశం తెలంగాణలోనే ఉందని అంచనాకు వచ్చిన కాషాయ దళం, వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ప్రధాని మోడీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలనే పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తుంది.తెలంగాణలో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజిగిరి నుంచి ప్రధాని మోదీ పోటీ చేస్తే ఆ ప్రభావం తెలంగాణ రాష్ట్రం అంతటా ఉంటుందని, బీఆరఎస్ నుంచి భాజపాలోకి వలసలు కూడా ఉండే అవకాశం ఉందని బజాపా అంచనా వేస్తుందట .

Modi Competition From Telangana Kamaldalam New Sketch,telongana Politics,ts New

ముఖ్యంగా బారాస బలహీనంగా ఉన్న ఇలాంటి సమయంలో ప్రధాన ప్రతిపక్షాన్ని హైజాక్ చేయాలంటే మోడీ లాంటిది దీటైన నేత అవసరమని భాజపా భావిస్తున్నట్లుగా తెలుస్తుంది .ఇప్పటికే సూచనప్రాయంగా మోది ఈ ప్రతిపాదనను అంగీకరించారని, పూర్తిస్థాయి సమీక్ష తర్వాత నిర్ణయం ఫైనల్ అవుతుందని తెలుస్తుంది.మోది హవా తో తెలంగాణ తో పాటు ప్రక్కనే ఉన్న కర్ణాటక మరియు ఆంధ్ర ప్రదేశ్ ల పై కూడా ఆ ప్రభావం పడే అవకాశం ఉందన్నది బజాపా వ్యూహ కర్త ల ఆలోచన అట .దాంతో దక్షిణాది రాష్ట్రాల్లో తన బలం పుంజుకోవడానికి ఇది సరయిన సమయమని కాషాయ దళం బావిస్తున్నట్టుగా తెలుస్తుంది .

Advertisement
Modi Competition From Telangana Kamaldalam New Sketch,telongana Politics,ts New
నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

తాజా వార్తలు