లిక్కర్ పాలసీ ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై తీర్పు రిజర్వ్

ఢిల్లీ లిక్కర్ పాలసీ( Delhi Liquor Policy ) ఈడీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) బెయిల్ పై తీర్పు రిజర్వ్ అయింది.

ఈ మేరకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court ) మే 6వ తేదీన తీర్పును వెలువరించనుంది.

లిక్కర్ కుంభకోణంలో ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఇప్పటికే సీబీఐ( CBI ) కేసులో తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం మే 2వ తేదీన వెల్లడిస్తామని తెలిపింది.

ఇక ఈడీ( ED ) కేసులో సుదీర్ఘ వాదనలు జరగగా.కవితకు బెయిల్ ఇస్తే ఆమె కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ కోర్టుకు తెలిపింది.

ఈ క్రమంలోనే కవిత సాక్షులను, ఆధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో బెయిల్ ఇవ్వొద్దంటూ ఈడీ కోర్టుకు తెలిపింది.ఈ పిటిషన్ పై సుదీర్ఘ వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

Advertisement
గుంటూరు జీజీహెచ్ లో పెట్ స్కాన్' సిద్ధం

తాజా వార్తలు