హైదరాబాద్ లో వెలుగు చూసిన ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారంపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.జీహెచ్ఎంసీ నకిలీ సర్టిఫికెట్ల దందాలో ఎంఐఎం పార్టీ ప్రమేయం ఉందని ఆరోపించారు.
ఫేక్ సర్టిఫికెట్స్ వ్యవహారంపై సీబీఐతో లోతుగా విచారణ చేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు.బర్త్, డెత్ సర్టిఫికెట్లే కాకుండా ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు కూడా తనిఖీ చేయాలని కోరారు.
అయితే తాజాగా జీహెచ్ఎంసీలో నిర్దేశిత ధ్రువపత్రాలు లేకుండానే 31 వేల బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ చేసిన విషయం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.







