బాలినేనిపై ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు విచారకరం - ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నెల్లూరు : రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్ కామెంట్స్.

బాలినేని శ్రీనివాసులు రెడ్డిపై ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు విచారకరం తనపని తను చేసుకుంటూ, తిరుగులేని వ్యక్తి బాలినేని శ్రీనివాసులురెడ్డి.

వ్యక్తిత్వ విషయాలపై చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా.రాజకీయ విమర్శలు ఆరోగ్యకరంగా ఉండాలి, అంతే కాని ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదు.

వైసీపికి ప్రకాశంలో పర్యాయ పదం బాలినేని.వైఎస్సార్ కి అంత్యంత సన్నిహితుడిగా ఉండి, ఆయన మరణం తర్వాత జగన్ వెంట నడిచారు.

మంత్రి పదవి కూడా రాజీనామా చేసిన వ్యక్తి బాలినేని శ్రీనివాసులురెడ్డి.సొంతపార్టీ వ్యక్తులు ద్రోహం చేస్తున్నారని ఆయన బాధపడటం నాకు బాదేసింది.

Advertisement

ఆయన ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా సొంతపార్టీ నేతలు ఎవ్వరు ప్రవర్తించకూడదు.బాలినేని సమస్య ఎలా ఉందో అదే సమస్యతో నేను కూడా ఇబ్బంది పడుతున్నా.

వైసీపీలో కొంతమంది ముఖ్యనేతలకి, ఎమ్మెల్యేలకి ఇతర నియోజకవర్గాల్లో జోక్యం ఎక్కువైంది.వైసీపీ పెట్టక ముందు నుంచి పార్టీలో కష్టం చేసిన వ్యక్తుల్లో నేను ఒక్కడిని.

పార్టీని ఎలా ముందుకు తీస్కెళ్లాలి, ఎలా మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవాలో చూసుకోకుండా ఇతర నియజకవర్గాల్లో వేలు పెడుతున్నారు.ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలీని వైసీపీలోని కొంతమంది ముఖ్య నేతలు నా నియోజవర్గంలో వేలు పెడుతున్నారు.

నాకు నిజంగా బాధేస్తుంది, ఇతర నియోజకవర్గాల నేతలు రూరల్ లో నన్ను బలహీనం చేయాలని చూస్తున్నారు.అది వాళ్ళ వాళ్ళ కాదు, రూరల్ ప్రజల అండ, సీఎం జగన్ ఆశీస్సులు ఉన్నంత వరకు నన్నేమి చేయలేరు.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

జిల్లాలో ఇతర నియోజకవర్గాల్లో కలగజేసుకునే సంబంధాలు నాకు ఉన్నాయి, నేను కలగజేసుకోను.టీడీపీ జిల్లా అధ్యక్షుడు అజీజ్ ని నేను రాజకీయ శత్రువుగా, రాజకీయ పోటీదారుడిగా చూడను, రాజకీయ సహచరుడిగానే చూస్తాను.

Advertisement

పక్క నియోజకవర్గాల్లో ఏ పెళ్లి ఉన్నా, శుభకార్యాలు ఉన్నా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకి చెప్పే వెళ్తా.ఎవరిల్లు వారు చక్కదిద్దుకోవాలి, పక్క ఇళ్లలోకి తొంగిచూసే పద్దతి మానుకోండి.

తాజా వార్తలు