రాహుల్ గాంధీకి అస్సాం సీఎం క్షమాపణ చెప్పాలి.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి

ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.రాహుల్ గాంధీకి అస్సాం సీఎం క్షమాపణ చెప్పాలి.

లేదంటే ఎప్పుడు తెలంగాణకి వచ్చిన అస్సాం సీఎం హిమంత ను అడ్డుకుంటాం.

రాహుల్ గాంధీ పై అస్సాం బీజేపీ సీఎం చేసిన అనుచిత వ్యాఖ్యల పై సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి.

ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, కాంగ్రెస్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.అస్సాం బీజేపీ సీఎం హిమంత ఒక మూర్ఖుడు.

బీజేపీ భారత్ మాతాకి జై అని కేవలం రాజకీయం కోసమే అంటుంది.తల్లి పై ప్రేమ ఉంటే బీజేపీ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యరు.

Advertisement
Mla Jaggareddy Fires On Assam Cm Comments On Rahul Gandhi Details, Mla Jaggaredd

ఇదేనా బీజేపీ సంస్కృతి, విలువలు.పార్లిమెంట్ లో బీజేపీ ని ఎవరు ప్రశ్నించిన ఇలా వారి కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే బీజేపీ సంస్కృతా.

నీతి, జాతి లేని బీజేపీ నేతలు రాహుల్ గాంధీ ని విమర్శిస్తే సహించేది లేదు.ఒక తల్లి పట్ల సంస్కారం లేకుండా మాట్లాడిన అస్సామ్ ముఖ్య మంత్రి ని వెంటనే బర్తరఫ్ చేయాలి.

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ను తెలంగాణ లో అడుగుపెట్టనియ్యం.ఆయన ఎప్పుడు తెలంగాణ కు వచ్చిన అడ్డుకుని తీరుతాం .విలువలతో కూడిన కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం.విలువలు లేకుండా దిగజారి రాజ కీయాలు చేస్తుంది బీజేపీ.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కుటుంబం ది త్యాగాల చరిత్ర.ఈ దేశం కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు ప్రాణ త్యాగం చేశారు.

నటుడిగా పనికిరాడు అని చెప్పిన రాజశేఖర్ తోనే 5 సినిమాలు చేసిన నిర్మాత ఎవరో తెలుసా?

ఈ చరిత్ర లో బీజేపీ నాయకులు ఎక్కడ ఉన్నారు.దేశం కోసం వారి ఆస్తులను త్యాగం చేసిన కుటుంబం రాహుల్ గాంధీ ది.స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ తో కలిసి నెహ్రు గారు 16 సంవత్సరాలు జైల్లో ఉన్నారు ఇది చరిత్ర.అలాగే ఇందిరా గాంధీ గారు బాల్య వయసులోనే 5 ,ఆరు ఏళ్లు స్వాతంత్ర ఉద్యమంలో జైల్లో లో ఉన్నారు.

Mla Jaggareddy Fires On Assam Cm Comments On Rahul Gandhi Details, Mla Jaggaredd
Advertisement

ఈ భారత దేశం కోసం ప్రధాని హోదా లో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ గారు బలిదానం కావడం జరిగింది.ఇది చరిత్ర .ఈ చరిత్ర లో బీజేపీ ఎక్కడ ఉంది.అస్సాం సీఎం ఎక్కడ ఉన్నారు.

ఒక వాజ్ పాయ్, అద్వానీ తప్పితే ఇప్పుడున్న బీజేపీ సీఎంలు,కేంద్ర మంత్రులు ఎవరు స్వాతంత్ర  ఉద్యమంలో పుట్టినవారు కాదు.ఎలాంటి చరిత్ర లేని ఈ బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ కుటుంబం గురించి మాట్లాడడం  దురదృష్టకరం.

ఇంత తెలివి లేని సీఎం ని బీజేపీ సమర్దిస్తుందంటే బీజేపీ నాయకులంతా మూర్ఖులు ఎవరు ఉండరు.ఈ దేశ కోసం ప్రాణ త్యాగలు చేసిన తెచ్చిన స్వతంత్ర దేశంలో మీరంతా సీఎం లు అయ్యారు.

ఇకనైనా బీజేపీ నాయకులు ఇలాంటి దిగజారుడు మాటలు మానుకోవాలి.లేదంటే మేము దీనికి తగ్గట్లు మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్న.10 సంవత్సరాలు ప్రధాన మంత్రి అయ్యే అవకాశం ఉన్న రాహుల్ గాంధీ కాలేదు.కుర్చీల కోసం, పదవుల కోసం కొట్టుకునే చరిత్ర బీజేపీ ది.

తాజా వార్తలు