టీపీసీసీ చీఫ్ కి ఎమ్మెల్యే గండ్ర సవాల్

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సవాల్ విసిరారు.తను అక్రమంగా సంపాదించినట్లు నిరూపిస్తావా రేవంత్ అని ప్రశ్నించారు.

అక్రమంగా సంపాదించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని గండ్ర తెలిపారు.ప్రజా జీవితంలో ఆస్తులను అమ్ముకున్నానన్నారు.

అవినీతి పరులకు దేశ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని ఆరోపించారు.చంద్రబాబు ఏజెంట్ గా తెలంగాణలో చలామణి అవుతున్నారని విమర్శించారు.

రేవంత్ తో తిరిగే వారంతా చంద్రబాబు బీ-టీమేనని పేర్కొన్నారు.దమ్ముంటే రేవంత్ రెడ్డి భూపాలపల్లిలో పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు.

Advertisement

చిత్తుగా ఓడిస్తానన్న ఎమ్మెల్యే గండ్ర సవాల్ కు సిద్ధమా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.

మన ఇంటి ఆనంది మనోళ్లకు పెద్దగా నచ్చలేదు.. జాంబిరెడ్డి హీరోయిన్ ఆనంది గురించి ఆసక్తికర విషయాలు
Advertisement