తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాన్ ముగింపు దశకు వచ్చింది.చివరి వారం లో కూడా ఏడు మంది ఉండటంతో ఎలా గ్రాండ్ ఫినాలే ఉండబోతుంది అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.
వీక్ మద్యలోనే ఇద్దరిని ఎలిమినేట్ చేస్తారు అంటూ మేము గతంలోనే చెప్పాము.అన్నట్లుగానే రేపటి ఎపిసోడ్ లో ఇద్దరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు.
వారు ఇద్దరు ఎవరు అనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. అనీల్ మరియు బాబా బాస్కర్ ఇద్దరు కూడా బయటకు వచ్చేశారు.
టాప్ 5 లో అనీల్ ఉంటాడు.బాబా మాస్టర్ మరియు మిత్ర ఎలిమినేట్ అవుతుందని అంతా భావించారు.
కాని అనూహ్యంగా బిగ్ బాస్ నుండి అనీల్ బయటకు వచ్చేశాడు.అనీల్ బయటకు రావడం ఒక ఎత్తు అయితే ఇక్కడ అనూహ్యంగా టాప్ 3 లో మిత్ర నిలవడం హైలైట్ గా నిలిచింది.
మొన్నటి వరకు యాంకర్ శివ కాస్త ఎంటర్ టైనర్ శివ గా మారాడు కనుక ఖచ్చితంగా ఆయన ట్రోఫీ దక్కించుకునే అవకాశం ఉందని.లేదంటే రన్నర్ గా అయినా నిలుస్తాడనే వార్తలు వచ్చాయి.
కాని యాంకర్ శివ ట్రోఫీ దక్కించుకోలేదు.రన్నర్ గా నిలువలేదు.కనీసం మూడవ స్థానంలో కూడా నిలువలేక పోయాడు.విచిత్రం ఏంటీ అంటే మూడవ స్థానంలో మిత్ర నిలిచింది.
అరియానా అయిదవ స్థానంలో నిలవడం మరింత షాకింగ్ విషయం అనడంలో సందేహం లేదు.మొత్తానికి మిత్ర మరియు శివ ల మద్య మూడవ స్థానం కోసం జరిగిన ఫైట్ లో మిత్ర విజయం సాధించడం విచిత్రంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఎప్పుడో రెండు మూడు వారాలు అవ్వగానే వెళ్లి పోవాల్సిన మిత్ర ఇంకా కూడా కంటిన్యూ అయ్యింది… టాప్ 3 వరకు వెళ్లింది అంటే మామూలు విషయం కాదు.ఆమె వెనుక ఖచ్చితంగా ఏదో శక్తి ఉందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆమె తక్కువ ఓట్లు వచ్చినా ఇలా నెట్టుకు వచ్చిందంటున్నారు.ఇక బిగ్ బాస్ విన్నర్ గా బిందు మాధవి నిలిచిన విషయం తెల్సిందే.







