కళావతి గ్యాంగ్ ను మిస్ అవుతున్న మహానటి.. పిక్స్ షేర్.. నెట్టింట వైరల్!

కీర్తి సురేష్.ఈమె పేరు ఇప్పుడు అందరికి సుపరిచితమే.

సహజమైన నటనతో ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకుంది ఈ మహానటి.

ఫస్ట్ సినిమాతో హిట్ కొట్టిన నటనకు పెద్దగా పేరు రాలేదు.

కానీ కీర్తి సురేష్ మహానటి సినిమా చేసిన తర్వాత మాత్రం ఈమెను తెరమీద ఎవ్వరు చూడలేదు.మహానటి సావిత్రి గారినే ఉహించు కున్నారు.

అంతలా ఈమె సత్తా చాటింది.ఈ సినిమాతో జాతీయ పురస్కారం అందుకుని జాతీయ నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

Advertisement

స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.వరుస అవకాశాలు కూడా ఈ అమ్మడిని వరించాయి.

అయితే ఆ తర్వాత నుండి ఈమె ఎంచుకునే పాత్రల కారణంగా కెరీర్ గాడి తప్పింది.ఇటీవలే నటించిన సర్కారు వారి పాట హిట్ అయ్యింది.

మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.ఈమె సర్కారు హిట్ అయితే సొంతం చేసుకోవడంతో మరీ తన మార్కెట్ పడిపోకుండా అయితే కాపాడుకుంది.

ఈ సినిమాలో కీర్తి సురేష్ కళావతిగా మెప్పించింది.ఈమెకు ఇందులో ఒక గ్యాంగ్ కూడా ఉన్న విషయం విదితమే.

How Wild Robin Works For UK Mobile Players : Skill, Luck, And Geolocation Explained
బిడ్డకు అన్నప్రాసన కార్యక్రమం ఏ సమయంలో చేయాలో తెలుసా..!

ఇప్పుడు అదే గ్యాంగ్ ను గుర్తు చేసుకుంటూ కీర్తి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసింది.ఈమె కళావతి గ్యాంగ్ తో ఎంజాయ్ చేసిన ఫోటోలను షేర్ చేసింది.

Advertisement

తన ఫ్రెండ్స్ గ్యాంగ్ తో ఎంజాయ్ చేసిన ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇక ఈమె కెరీర్ విషయానికి వస్తే.ప్రెసెంట్ కీర్తి చేతిలో రెండు తెలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

మెగాస్టార్ భోళా శంకర్ లో నటిస్తుంది.మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు కు చెల్లెలి పాత్రలో కీర్తి నటిస్తున్నట్టు ఇప్పటికే అఫిషియల్ గా ప్రకటించారు.

అలాగే నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమాలో కూడా ఈ అమ్మడు హీరోయిన్ గా నటిస్తుంది.