కళ్ళ కింద నలుపు అసహ్యంగా కనిపిస్తుందా.. వర్రీ వద్దు వారం రోజుల్లో ఇలా వదిలించుకోండి!

ఆహారపు అలవాట్లు, శరీరంలో వేడి ఎక్కువ అవ్వడం, కంటి నిండా నిద్ర లేకపోవడం, పలు రకాల మందుల వాడకం.

తదితర కారణాల వల్ల చాలా మందికి కళ్ళ కింద నలుపు ఏర్పడుతుంది.

ఈ నలుపు చాలా అసహ్యంగా కనిపిస్తుంది.ముఖాన్ని కాంతిహీనంగా చూపిస్తుంది.

ఈ క్రమంలోనే కళ్ళ కింద నలుపును ఎలా పోగొట్టుకోవాలో తెలియక తెగ సతమతం అవుతుంటారు.వర్రీ వద్దు.

ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ మ్యాజికల్ రెమెడీని పాటిస్తే కేవలం వారం రోజుల్లో కళ్ళ కింద ఆ నలుపును వదిలించుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Miracle Home Remedy To Get Rid Of Dark Circles Under The Eyes , Home Remedy,
Advertisement
Miracle Home Remedy To Get Rid Of Dark Circles Under The Eyes , Home Remedy,

ముందుగా ఒక ఆరెంజ్ పండును ( Orange fruit )తీసుకుని ఉప్పు నీటిలో శుభ్రంగా కడగాలి.ఆ తర్వాత తొక్క తీయకుండా ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె, హాఫ్ టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్,( Wild Turmeric Powder ) వన్‌ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon juice ), నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు ఆరెంజ్ జ్యూస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

Miracle Home Remedy To Get Rid Of Dark Circles Under The Eyes , Home Remedy,

చివరగా మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, ( Aloe vera gel )చిటికెడు కుంకుమ పువ్వు వేసి మరో ఐదు నిమిషాల పాటు మిక్స్ చేస్తే మంచి క్రీమ్ సిద్ధం అవుతుంది.ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ఈ క్రీమ్ ను కళ్ళ కింద మాత్రమే కాకుండా ముఖం మొత్తానికి అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

రోజు నైట్ ఇలా కనుక చేస్తే కేవలం వారం రోజుల్లోనే కళ్ళ కింద నలుపు మొత్తం మాయమవుతుంది.అదే సమయంలో స్కిన్ వైట్ గా బ్రైట్ గా మారుతుంది.

న్యూస్ రౌండప్ టాప్ 20

ముడతలు, చారలు వంటి వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరకుండా సైతం ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు