Animal Movie : ఆనిమల్ సినిమా లో ఈ లోటుపాట్లు లేకుండా ఉంటే అద్భుతమైన చిత్రంగా ఉండేది !

ఆనిమల్ సినిమా( Animal movie ) ప్రస్తుతం నేషనల్ బజ్.ఆటిట్యూడ్ కి పరాకాష్ట గా ఈ చిత్రం తెరకెక్కింది.

 Minus Points In Animal Movie-TeluguStop.com

అప్పట్లో వచ్చిన అర్జున్ రెడ్డి నుంచి ఇప్పుడు వచ్చిన ఆనిమల్ వరకు అదే ఆటిట్యూడ్ కొనసాగుతుంది.మరి ముందు ముందు ఆటిట్యూడ్ తో సినిమాలు తీస్తూ పోతే ఎలా చెప్పండి.

జనాలకు విసుగు పుట్టి సందీప్ రెడ్డి పేరు త్వరగా అందరు మర్చిపోవాల్సి వస్తుంది .ఇదేమి సందీప్ కి వార్నింగ్ అయితే కాదు.ప్రేమతో ఒక మాట ముందు చూపు కోసం చెప్తున్నదే.ఎప్పుడైనా సరే ఇండస్ట్రీ కి ఒక కొత్త దర్శకుడు బోలెడంత ట్యాలెంట్, మంచి క్రియేటివిటీ ఉంటే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ ఆ దర్శకుణ్ణి తమ తల పైన పెట్టుకొని మోస్తారు.

అందుకే ఇప్పటికి ఎన్నో ప్లాప్ సినిమాలు తీస్తున్న పూరి జగన్నాద్, శ్రీను వైట్ల, వినాయక్ లాంటి వారిని ప్రేక్షకులు మళ్లి మళ్లి మోస్తూనే ఉన్నారు.ముందు ముందు మోస్తూనే ఉంటారు.

Telugu Animal, Arjun Reddy, Bollywood, Puri Jagannadh, Ranbir Kapoor, Sandeepred

అయితే ఆనిమల్ విషయానికి వచ్చే సరికి సందీప్ రెడ్డి వంగా ( Sandeep reddy vanga )కొన్ని విషయాలను పూర్తిగా విస్మరించాడు.అందుకే కొన్ని లోటుపాట్లు ఆనిమల్ సినిమాలో కొట్టచ్చినట్టు కనిపిస్తున్నాయి.మరి అవేంటో ఒకసారి తెలుసుకుందాం.అర్జున్ రెడ్డి మత్తులో నుంచి బయటకు రాని సందీప్ ఆడియెన్స్ పల్స్ పట్టుకోవడంలో ఖచ్చితంగా ఫెయిల్ అయ్యాడు.సినిమా రన్ టైం ఈ చిత్రానికి మొదటి దెబ్బ గా అనుకోవచ్చు.ఫోన్స్, రీల్స్ అలవాటైన ప్రేక్షకుడికి మూడు గంటల 20 నిముషాలు కూర్చోవాలంటే అయ్యే పని కాదు.

ఎడిటర్ కూడా సందీప్ నెరవేర్చడం తో ఏ సీన్ కట్ చేయాలన్న ఇష్టపడ్డట్టు లేదు.డైరెక్టర్ ఎడిటర్ అయితే ఇదే ప్రాబ్లమ్ వస్తుంది.

కొన్ని సీన్స్ బోర్ కొట్టినప్పుడు ప్రేక్షకులు ఫోన్స్ లో బిజీ అయిపోవడం థియేటర్ లో చాల చోట్ల కనిపిస్తుంది.ఈ చిత్రానికి ఇన్ని గంటలు కూర్చోవడానికి రిపీట్ ఆడియెన్స్ రావడం కష్టం.

లెన్త్ పెంచాలని డిసైడ్ అయితే అది వెబ్ సిరీస్ చేయడం బెటర్.

Telugu Animal, Arjun Reddy, Bollywood, Puri Jagannadh, Ranbir Kapoor, Sandeepred

ఏ సినిమా అయితే రిపీట్ ఆడియెన్స్ ని రప్పించుకుంటుందో అదే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.ఇప్పటికే థియేటర్ కి దూరం అయి ఓటిటి కి ప్రేక్షకుడు దగ్గరయి పోయాడు.ఓటిటి కి వచ్చాక చుద్దాం అనుకున్న సినిమా ఖచ్చితంగా ఫెయిల్యూర్ సినిమానే.

ఇక ఈ సినిమాలో ఎన్ని ఉంటే ఏం లాభం.అసలు ఎమోషన్ లేదు.

తండ్రి కొడుకుల మధ్య బలమైన ఎమోషన్ సీన్స్ లేకపోవడం అతి పెద్ద మైనస్ పాయింట్.మితిమీరిన హింస వల్ల సాధించేది ఏంటి.? ఉన్న ఆ ఒక్క బలమైన సీన్ ట్రైలర్ లో వాడి, అవసరానికి మించి వైలెన్స్ చూపించి సినిమా దెబ్బకొట్టించేసావ్.పైగా విజువల్ గా చూడటం తప్ప కథ మొత్తం ముందే తెలిసిపోతుండటం మరొక మైనస్.

కేవలం రణబీర్ కపూర్( Ranbir Kapoor ) వన్ మ్యాన్ షో కోసం మాత్రమే వెళ్లి చూడాల్సిన సినిమా గా ఆనిమల్ మారిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube