ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని.( minister vidudala rajini ).
త్వరలో రాష్ట్రంలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు( Arogyasree Cards ) ఇవ్వబోతున్నట్లు తెలియజేశారు.అంతేకాకుండా ఆరోగ్య శ్రీ పరిధిలోకి మరికొన్ని వైద్య సేవలను తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.
ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షల వరకు పెంచినట్లు స్పష్టం చేశారు.త్వరలో కొత్త కార్డులు పంపిణీ చేస్తామని స్పష్టం చేయడం జరిగింది.
ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేయబోతున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.ఇదే సమయంలో త్వరలో “ఆరోగ్య సురక్ష” రెండో విడత కార్యక్రమం ఉండబోతున్నట్లు కూడా పేర్కొన్నారు.
ఆల్రెడీ సోమవారం సీఎం జగన్( cm jagan ) వైద్య ఆరోగ్యశాఖ పై సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన “జగనన్న ఆరోగ్య సురక్ష” ( Jagananna Health suraksha )కార్యక్రమంలో గుర్తించిన రోగుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.వాళ్లందరికీ సకాలంలో మందులు అందించడంతోపాటు మందులు కొరత లేకుండా చూడాలని అన్నారు.ఇదే సమయంలో ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు.
ప్రతి ఒక్కరి ఫోన్ లో ఆరోగ్యశ్రీ, దిశ యాప్ లు ఉండేటట్టు అధికారులు బాధ్యత వహించాలని పేర్కొన్నారు.డిసెంబర్ 18వ తారీకు నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేయాలని సూచించారు.
ఆసుపత్రులలో ఎక్కడా సిబ్బంది లేదనే మాట వినపడకూడదు… ఖాళీలు ఉండకూడదని అన్నారు.కాగా తాజాగా నేడు వైద్యశాఖ మంత్రి విడదల రజనీ కూడా… త్వరలో రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేయబోతున్నట్లు ప్రకటించడం జరిగింది.