కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..!!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు.

కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాపాడుతున్నట్లు ఆరోపించారు.తెలంగాణలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరగకుండా కాపాడే ప్రయత్నాలు కాంగ్రెస్ చేస్తున్నట్లు ఆరోపించడం జరిగింది.

ఈ వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు.హైదరాబాదులో మీడియా సమావేశం నిర్వహించారు.

Minister Uttam Kumar Reddy Angry Over Kishan Reddy Comments Minister Uttam Kumar

ఈ సందర్భంగా కాలేశ్వరం విషయంలో కిషన్ రెడ్డి తమపై ఆరోపణలు చేయటం హాస్యాస్పదమని అన్నారు.కాలేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రంలోని బీజేపీ మద్దతు ఇవ్వడం జరిగింది.₹1.20 లక్షల కోట్లు మంజూరు చేశారు.ఆ ప్రాజెక్ట్ అవకతవకలపై మేడిగడ్డ కుంగినా కేసీఆర్ నోరు మెదపకపోవడాన్ని బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించలేదు.? మేం అధికారంలోకి వచ్చి 20 రోజులు కాకుండనే విమర్శలా అని మండిపడటం జరిగింది.కాలేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై వారం రోజుల్లో న్యాయ విచారణకు ఆదేశిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

Advertisement
Minister Uttam Kumar Reddy Angry Over Kishan Reddy Comments Minister Uttam Kumar

వ్యాఖ్యానించారు.ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు.

ఒకే ఒక్కమాటతో చిరు, నాగ్, వెంకీ మల్టీస్టారర్ మూవీ క్యాన్సిల్ అయ్యిందట.. !
Advertisement

తాజా వార్తలు