బీజేపీ నాయకులరా దమ్ము, ధైర్యం ఉంటె పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కు జాతీయ హోదా ఇస్తామని చెప్పండి: మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్

బిజెపి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామయాత్ర పై రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు.

జోగులంబా గద్వాల జిల్లా పర్యటనలో భాగంగా స్థానిక శాసన సభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్ అబ్రాహాము గార్లతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామయాత్ర ను దొంగల యాత్రగా అభివర్ణించారు.యాత్రల పేరుతో బండి సంజయ్ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.

ఈ యాత్ర వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు.బీజేపీ పార్టీ నాయకులకు దమ్ము ధైర్యం ఉంటె పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కు జాతీయ హోదా ఇస్తామని చెప్పాలని డిమాండ్ చేశారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు ధాన్యం కొనుగోలు పై ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి సిగ్గు లేకుండా యాత్రలు చేస్తున్నారన్నారని మంత్రి ఆరోపించారు.

Advertisement
పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...

తాజా వార్తలు