హైదరాబాద్ లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు.ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలతో ఆమె భేటీ కానున్నారు.
జూనియర్ కాలేజీల్లో జరుగుతున్న ఆత్మహత్యలపై మంత్రి సబితా ప్రధానంగా చర్చించనున్నారు.కాగా సమావేశంలో మొత్తం 14 ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు పాల్గొననున్నాయి.
ఇటీవల నార్సింగిలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో సాత్విక్ అనే విద్యార్థి యాజమాన్యం వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న తెలంగాణ విద్యాశాఖ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.